పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ రంకము


సంస్కారాధ్వీజ ఉచ్యతే”! అన నది ఋషి.ప్రోక్తము కదా! వసిష్ఠులవారు నారదమహా ఋషులు, వాల్మీకి, వ్యాసులు, పరాశరులు , వీరందరు బాహ్మణపుత్రు లేనా?

రఘు: _వకీలుగుమాస్తాగారూ! మీ కెప్పటికిని వక్రమార్గమే అల వాటు. వాల్మీకి, నారదులు, వ్యాసులు వీరంత మగ వారయ్యా ఆడువారలు కారు.

భాస్కర:- వారు మగవారు కనుక గొప్ప వారైరని మాయభిప్రా యమా, ఆచార్యుల వారూ! ఎంతమంది స్త్రీలు ఉపనిషత్కార లో తమకు తెలియునా? స్త్రీలే వేదముల కలంకార పాయులై యుండిరి. చెప్పెదను వినుము. జుహం-గోథ, యమి, శచి, ఆహా! వీరందరు ఆడవారయ్యా! ఋగ్వేదములోని పదియవ మండల మునకు గారణము స్త్రీ బుద్ధియే. పాపము! ఈ సమాచారము నీ కేమి తెలియును. మిగురువులగు శ్రీ మాణ విద్యాలంకారా చార్యుల వారికి కుడుముల తినుటకు తెలియును. పొట్ట పెంచుటకు తెలియును. ప్రపంచమునకు టోపి వేయుటకు తెలియును. వారి పేరు విద్యాలంకారులు. వారికి అలంకారానికే విద్య. నీవన్న నో గురువులను మించిన పరమానంద శిష్యుడు. “ఎద్దు మొద్దు స్వ రూపాయ. ఏనుఃపోతాయ మంగళం.”

రఘు:__చాలును లెమ్ము. నీసమాచారము తెలిసినదేకదా! వాదిం చడమునకు చేతకాకపోతే తిట్టడము మొదలు పెట్టుట నీకు వాడుకయే.

భాస్క:_ ఓ రే! పనికిమాలిన వాడా! ( Stupid) స్త్రీల మహిమను వర్ణించుటకు వాదము వేరు కావ లెనా? విను. శక్తి స్వరూపము స్త్రీ. సహన స్వరూపము స్త్రీ. సంసారము స్త్రీనుంచియే. ఆచార విచారములు స్త్రీ నుంచి యే. ఈ ప్రపంచమునకు ఆధా రము స్త్రీ రూపమే. అది కాక నీ తల్లి” స్త్రీయే. మరి స్త్రీలకు పుట్టిన వారు బ్రాహ్మణు లెట్లగుదురు? అర్థమాయేనా?

17