పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి యంకము


ముందుకు సాగడముకద్దు. అట్టి యీ ప్రపంచనాటకములో, ఇచ్ఛానుసారముగా ఎగురుటకు బాహ్మణుల కొక్కరికి మాత్రము అధికారముకద్దు. దానిలోగూడ శాస్త్రము, అందు లోని పరమార్ధము తెలిసిన మాబోటి వారలకు మాచే ఉప దేశింపబడు మీబోటి వారికిని ఎక్కువ అధికారము.

భీమ:- ఏమో లేనిపోని సందేహములు నన్న బాధించుచున్న వండీ,

విద్యా:- చూడండీ! సందేహమే సర్వ నాశకము. వేద, శాస్త్ర, పురాణేతిహాసములను ఈసందేహములు తొలగించుట కే మన పెద్దలు వ్రాసి పెట్టినది. (బాహ్మణులకు బాహ్మణ్యమే ముఖ్య ము గాని శాస్త్రనిబఁధనలు లేవు. ఆచార్యులకు అధికారములు కలవు. చేయుటకు శాస్త్రములు కలవు. విడిచి పెట్టుటకు శాస్త్ర ములుగలవు. ఇదియే ఇప్పటి 'బాహ్మణాచార్యుల యధికారము.

భీమ:- చూడండీ! ఇంద్రియముల బలము ఎంత ప్రమాదముకలు గ జేయునో. ఇంద్రియనిగ్రహ మెంతకష్ట మో!

విద్యా:- మీకు మనధర్మములలోని లౌకిక రహస్యముల పరిచ యమింకను లేదు. ఇంద్రియ నిగ్రహము చేయవలయునని వ్రాసి యున్నారుగాని అయి తే దృష్టాంతముల చెప్పెదవినుడు. శ్రీకృ షుడవతార పురుషుడవును గదా!

భీమ:- ఆహా! సం దేహమేమి!

విద్యా: - ఆ! గమనించండి. శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవిని - మొదట ఉడాయిఁపు, పిదప వివాహము ఎక్కడ వచ్చెనయ్యా కట్టుబాట్లు?

భీమ:- అవును. (అని ఇంచుక తలయూచును.)

విద్యా:- ఇంకొక్కటి చూడండీ! అర్జునుఁడు శ్రీకృష్ణ పరమాత్మకు కేవల ముఖ్య శిష్యుడు, అర్జునుడు లేకపోయిన యెడల శ్రీమద్భగ వద్గీత యే వెలువడియుండదు. “అర్జున ఉవాచ” లేకయుండిన "శ్రీభగవాను వాచ” ఎక్కడనుండి వచ్చును? అవునుగదా! అట్టి యర్జునుడేమి చేసెను. సుభద్రను-మొదట ఉడాయింపు పిదప వివాహము. ఎక్కడ పోయినవయ్యా మీకట్టుబాట్లు!