పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి రంగము

భీమ:- ఏమియు లేదు. చూడుడు ఆచార్యులవారూ! ఎదోభర్తను పోగొట్టుకొని, తల్లిదండ్రులులేని దు:ఖభాజనమైన జన్మము, అని నేనెంతో విశ్వాసముంచి, ఆపిల్లను సర్వవిధములైన సౌకర్యములు తక్కువలేక కలుగజేయువచ్చితిని. ఏదియోకొంచెము హెచ్చు తక్కువలైనప్పుడు................

విద్యా:- రాయల వారూ! దీనివిషయమై యోచింపవలసిన పనియేలేదు. ప్రపంచము ద్వంద్వమయము. సుఖదు:ఖములు కావడి కుండలు. మీకుతెలియదా!

"సమదు:ఖసుఖంధీరం, సోమృతత్వాయకల్పతే"

శ్రీ మద్భగవద్గీతా వాక్యమిది. జ్ఞానముండవలెనయ్యా జ్ఞానము!

భీమ:- ఆచార్యులవారూ! మీరు చెప్పునది మిక్కిలి యోగ్యమైనమాట, అయిన నామాటలు మీకు పూర్తిగ అర్ధమైనట్లు లేదు. విశేషమేమియులేదు. ఒక్కరహస్యం మీతోచెప్పవలయును. మీరు వేదమూర్తులు. కలవారు, తార కించిత్తు త్రోవతప్పి--చిన్నపిల్ల చూడండి! ఏమోపాపము.....ఇదేకష్టమూ.

విద్యా:-- దీనికి చింతయేల? ఇది ప్రకృతినియమము. ప్రపంచము జరుగవలెను. వృద్దిగాంచవలయును. ఇది కేవలము ప్రకృతిధర్మము. మనమేమి కర్తలా? కారకులా? అంతయును, ప్రకృతియే! ఆట ఆడించుచున్నది.

భీమ:--మీరుచెప్పునది సరియే, అయితే, వివాహమను కట్టుబాటును మన ధర్మశాస్త్రములు చేసియున్నవిగదా?

విద్యా:--ఉండవలె! ఆకట్టుబాట్లు అవశ్యకమే. అయితే ఎవరికి ఆ కట్టుబాట్లు? మనకా? బ్రాహ్మణులకా? సంస్కృతము జదివి, శాస్త్రసంబంధ విషయములను కంఠస్ధముగా నుంచుకొనిన మనకా ఆకట్టుబాట్లు? ఆకట్టుబాట్లన్నియు- నేనొక గొప్ప రహస్యము చెప్పెదను. వినుడు జ్ఞానము లేనివారలకే. ఈప్రబంచము చంచలము. దీనికిచలనముకద్దు. మార్పుకద్దు. సంచారముకద్దు.