పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి రంగము

భీమ:- అందులకే ఆడవారికి బుద్ధిలేదనుట. మనబ్రాహ్మణ్యము ప్రకృతకాలములో కేవలము సంప్రదాయముపైననె ఆధారపడియున్నది. కాని అట్టి సంప్రదాయములలోను, గుప్త సంప్రదాయములకొన్ని, బహిరంగ సంప్రదాయములలోను, గుప్త సంప్రదాయములుకొన్ని, బహిరంగ సంప్రదాయములుకొన్నియు కలవు. సంసారముగుట్టు..... అని పెద్దలన్నారు. కావున సంసారము దానికి సంబంధమైన సకల విషయములు గుప్త సంప్రదాయములలో చేరినవి.

తార:- ఇదియంతయు నాకుఅర్థమేకాదు. ఇప్పుడే నామనస్సునకు నరకము ప్రాప్తించినట్లున్నది. దీనికి చేరికగా నీవుచెప్పినపని చేసినయెడల అంతకంటె హెచ్చుసంకటములు కలుగును. ఏవిధముగా నాలోచించిననను ఈ కార్యము హత్య అనియే తోచుచున్నది. స్త్రీలమనస్సు తమకడుపులోని ప్రేగులను వెలికితీయుటకైనను ఒప్పునుగాని తమచేతులార తమలోని ప్రాణమునే...

భీమ:- [నివారించి] ప్రాణము! పారవేయుట! ఎక్కడున్నది? నాకంటెను నీకెక్కువగా తెలియునా? దానికి ప్రాణమెక్కడనున్నది?

తార:- ప్రాణము నాకున్నది. నాప్రాణము దానియందున్నది. అది ప్రతినిమిషము తల్లికి అనుభవమగుచుండు మాటగాని మగవారికి అర్థముగాదు. దానిజీవనాడి వైద్యులచేతికి అందకపోయినను తల్లుల హృదయమునకు చెందియుండును. మగవారికంటికి దర్శనమియ్యకున్నను ప్రేమకు స్పర్శనమిచ్చు చుండును. అట్టి ప్రాణమును భంగపరుచుట పాపమే!

భీమ:- ఓసి అవివేకీ! నీకు పిచ్చిపట్టినది. కేశఖండనము లేకనే తలచెడినది. పాపము! పాపము! నీకంతయు తెలుసును కాబోలును. ప్రపంచములో పురుషోత్తముడగు వాసుదేవుడు బ్రాహ్మణ్యమును పుట్టించిన దెందుకనగ బ్రాహ్మణులు సకల ప్రపంచమునకు ఆదర్శప్రాయులై ప్రపంచములో ఆనందము సౌఖ్యము చేయవలయునని. అట్టి బ్రాహ్మణులే ఇట్టిపనులను బయలుపె