Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

శారదలేఖలు

ఇఁక నెందులకని నే నీవలకువచ్చివేసితిని. ఆవల నేను అమ్మణ్ణి గుడియందుండగా కర్పూరహారతి చేసినాడని ఆస్త్రీవచ్చి నాతోచెప్పెను. ఈవిధమున దేవతలు నేడు దౌర్జన్యపరులగు మానవులచేతిలో జిక్కి భక్తజన సులభులు గాకున్నారు. నేడు స్వామిదర్శనము కావలెనన్నచో నెఱ్ఱటోపీలో, యూనిఫారండ్రస్సులో కావలెను. లేదా ఐశ్వర్యసమృద్ధియైన నుండవలెను. ఈరెండును లేనివారిగతి పై పేదరాలిగతియే. రామేశ్వరము నుండి ప్రతివారును తప్పక తెచ్చుకొనునవి గవ్వలు. రామేశ్వరమునందుతప్ప మఱెచ్చటను గవ్వలు శంఖములు దొరకవు. అచ్చటగూడ గవ్వలంగళ్ళైదాఱుకంటె నెక్కువగలేవు. ఆయంగళ్ళచుట్టును వివిధదేశపు స్త్రీలెట్లు మూగియుందురో ఆచోద్యమును చూచి తీరవలెను. ఆడవారి బేరమగుటచేతను, ఏవిధముగానైనను తీసికొనక మానరను విశ్వాసముచేతను గవ్వ లతిప్రియముగ నమ్ముదురు. ఎనిమిది యాటగవ్వల తుదిధర నాలుగణాలు. అధికవెలగానున్నను అయిదులు, పదులు, రూకలుపెట్టి ప్రతిస్త్రీయును గవ్వలుతీసికొని వెళ్ళుచునే యుండును. రామేశ్వరము వెళ్ళెదమనిన గవ్వలు తెచ్చిపెట్టుడనుటయు, వెళ్ళివచ్చితిమనిన గవ్వలు తెచ్చినారాయని యడుగుటయు మనదేశమందు పరిపాటియైనమాట, కాని యీగవ్వలవలనగల ప్రయోజనమేమి? జూదమువంటి ఆటను ఆడి విలువలేనికాలమును వ్యర్థముచేసికొనుటయేగదా. నేడు స్త్రీలు దేశహితార్థము చేయవలసిన కార్యములు నేర్చుకొనవలసిన విద్యలు లలితకళలు ఎన్నియోయుండ నీగవ్వలాటలాడ నెవ్వ