శారదలేఖలు
71
ఆ కాలణాతో కర్పూరహారతిచేయుటకు అర్చకుడు నిరాకరించెను. “పేదరాలనునాయనా! అణా ద్వారంవద్ద తీసుకున్నారు నాయనా! నాలుగేండ్లనుంచీ రోగంతో తీసుకుంటూ ఈస్వామి దర్శనముచేస్తే రోగంపోతుందని గంపెడాశతో ఎంతో దూరాన్నించి వచ్చానునాయనా! ఈకానిడబ్బుతీసుకొనికొంచెం కర్పూరహారతిచెయ్యిస్వామీ, పేదరాలికిచేస్తే నీకు పుణ్యం ఉంటుందిస్వామీ” అనియాస్త్రీ యర్చకుని నెంతయోదీనముగ వేడుకొనెను. "డబ్బులేకుండా యీగుళ్లోకి యెందుకువచ్చావు. ఊరికే కర్పూరహారతి చేయడానికి నీవుపెట్టిన నౌకరులెవ్వరూ లేరు. ఫో!ఫో!" అని యర్చకుడు రూక్షవీక్షణుడై కఠినముగా పలికెను. వారు అర్చకులుగా నుండకున్నచో నింతకంటె దయాశీలురుగా నుండెడివారేమో! ఆసందర్భమును పరికింపుచు కొంతసేపు నేనచటనే నిలువబడితిని. ఆయర్చకుని మనస్సుకరఁగ లేదు. కర్పూరహారతిచేయక ఆస్త్రీకిసంతుష్టికలుగునట్లుగలేదు. అప్పుడాయర్చకునితో "ఆడబ్బులు నేనిస్తాను. ఆమెకు కర్పూరహారతిచేయండి” అని నేనంటిని. ఆయర్చకునకు నామీదగూడ కోపమునచ్చెను. "మీకెందుకు మీరువెళ్లండి నేను చేసేది లేదు.” అని తీవ్రముగా బలికెను. "ఎందుకుచేయరు, మీకు కావలసినది డబ్బులేగదా ఆడబ్బులెవరిస్తెమీకేమి? చేయండి” అని నేనంటిని. అర్చకునితీవ్రత చప్పునచల్లారెను. ఐదుకాసుల కొఱకు పేదరాలిపై తానుచేసిన దౌర్జన్యమునకు అతనిలో అతనికే సిగ్గుగలిగినది. అప్పుడాతడు నెమ్మదైనపలుకులతో 'నేనేదోచేస్తా. మీరు అమ్మణ్ణి గుల్లోకివెళ్లండి అమ్మా' అనెను.