Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

65

పువ్వులు, పండ్లు, బొమ్మలు, పటములు, నగలు, వస్త్రములు, పాత్రములు, పరికరములు మున్నగు సమస్తవస్తు దుకాణము లందే యున్నవి. గుడ్డ తీసుకొనిన వారావలకుబోయి కుట్టించుకొనవలసిన బాధలేకుండ నచ్చటనున్న కుట్టుయంత్రములకు లెక్కలేవు. కాని అవి అన్నియు చేతియంత్రములు. కాలితో త్రొక్కెడి కుట్టుయంత్రము లాయూర నరుదుగానున్నవి, యేలనో? చెన్న రాజధానిలో చెన్నపురి తరువాత మధురయే గొప్పపట్టణము కాన నీటికొళాయీలు, విద్యుద్దీపములు, మోటారుకారులు మున్నగు నాగరికపు పరికరములచే పట్టణము కలకల లాడుచుండును. మీనాక్షీ ఆలయముగూడ విద్యుద్దీపములతో ధగధగమని ప్రకాశింపుచుండును. మీనాక్షీ దేవికిగూడ సంపదకు కొదువలేదు. విలువైన రత్నాభరణములును పసిడివాహనములును బహుళముగనున్నవి. అయినను మూలవిగ్రహము దర్పములేక సౌమ్యముగనుండును. శుక్రవారమునాటిరాత్రి యామె దర్శనమే దుర్లభము. కాని దేవి కృపవల్ల మాకానాడుకూడ యామె చక్కగనే దర్శన మొసంగెను.

మధురలోగూడ నొక రాజమందిరమున్నది. అదిధర్మానాయుఁడు కట్టించినదట. తంజావూరి రాజైన తిరుమలనాయుడును మధురరాజైన ధర్మానాయుడును మామయల్లుండ్రట. తంజావూరి రాజమందిరములకంటె వేయిరెట్లధిక శిల్పకళా