Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

శారదలేఖలు

సౌభాగ్యవతియగు కల్పలతకు: —

నెచ్చెలీ,

నీవు వ్రాసిన యుత్తరముల నిన్ననే వచ్చి చూచితిని. నీకు జాబులవ్రాయుటకే నాకు సిగ్గగుచున్నది. ఏమందువా? ఇకనుండి తప్పక వ్రాయుదునని నీకు వాగ్దత్తము సేయుటయు ఆమఱుజాబే నీకు సకాలమున వ్రాయజాలకపోవుటయు పలుమాఱులు తటస్థించుచున్నది. శారదకు, మాటలకు చేతలకు దూరమని నీవు తలంతువేమోయని నాబిడియము. కాని యిది స్వయంకృతాపరాధముకాదు. దక్షిణదేశయాత్ర జేసెడు భాగ్యము నాకింతలో లభించునని నేను స్వప్నమందైన తలంపలేదు. దైవికముగ క్షణములో తటస్థించినది. ఆనాడు నీకు లిఖింపుచున్న లేఖనర్థాంతరముననే విడిచి తక్షణమే యాత్రకు సన్నద్ధనైతిని. వైకుంఠేకాదశి నాటికి శ్రీరంగమున కేగవలెనని పయనించెడునాటి మాతలంపు కాని చేరలేకపోతిమి. కాన యూరక చెన్న పట్టణమున నాదిన మేలగడుపవలెనని కాంచీపురమున కేగితిమి. ఉన్నతోన్నత ప్రాకార గోపురావళుల తోడను. విశాలమైన రాచబాటతోడను ఒప్పారు కాంచీపురము పూర్వ వైభవమును చాటుచుండెను. కాంచీపురము విష్ణుకంచి, శివకంచియని రెండుబాగములుగా నున్నది. విష్ణుకంచిలో స్వామి వరదరాజులు, ఆయన భార్య లక్ష్మీదేవి.