శారదలేఖలు
57
అనంతరము సాహితీ పరీక్షయందుత్తీర్ణలైన బాలికలకు పట్టములొసంగబడెను. తరువాత బహుమతులుగూడ నొసంగిరి. ఆబహుమతులన్నియు నెవరోవదాన్యు లొసంగినవే. ఆదాతలపేరు గూడ నక్కడచెప్పుచు బహుమానములిచ్చిరి. ఆటపాటలలో మిన్నయైన అన్నపూర్ణమ్మ బహుమతు లందుకొనుటలోగూడ మిన్నయయ్యెను. అధ్యక్షుల అంత్యోపన్యాసముతోడను బాలికల మంగళగీతములతోడను సభసమాప్తమయ్యెను. నామనం బానందపరిపూర్ణమయ్యెను.
కల్పలతా! అప్పుడు “తొలినాటి నాతలంపులెంత దుష్టమైనవి? ఏసంస్థయైన పుట్టిననాడే పెద్దదిగానుండుమన్న నెట్లుండును? ఇట్టి మహోత్కృష్ట ప్రతిష్ఠాపమున కై దేండ్ల జీవితమొక దీర్ఘకాలమా?" అని నాలో నేనే సిగ్గిలితిని.
మిత్రమా, ఈ విధముగ శారదా గురుకులము నిష్కళంక దేశసేవాపరాయణులుగ నున్నవారి నిరంతర కృషిచే క్రమాభివృద్ధినందుచు ఆంధ్రకన్యల నాహ్వానించుచున్నది. పుత్రికలు విద్యాపతులు కావలెనని యభిలషించెడు తలిదండ్రులకిది మంచి సమయము. తమ పుత్రికల శారదాలయమున కంపవచ్చును. స్త్రీ విద్యాభిమానులగు వదాన్యలోకమున కిదిమంచి యదను. తమ విత్తము నీయుత్కృష్ఠ ప్రతిష్ఠాపనమునకు దానముచేసి యశోవిశాలురు కావచ్చును. ఆంధ్రమహాజను లాలోచింతురు గాక. నీ కొమార్తెను శారదా గురుకులమున కంపరాదా?
1929 జనవరి
మిత్రురాలు
శారద.