Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

శారదలేఖలు

పైయుత్తమగుణములన్నియు మానవజాతి కంతటికిని కావలసినవే. గుణశీలములకు లింగభేదములేదు. స్త్రీగుణమని పురుషుడు దయను విడనాడినచో స్త్రీ మాడిపోవలెను. పురుషగుణమని స్త్రీ పాటుబడుట మానినచో పురుషు డన్నమునకై యలమటింపవలెను. నాయక్ గారి నిర్ణయముప్రకారము ధైర్యము, కష్టసహిష్ణుత, పుంలింగమునకు చెందినవి. స్వార్థత్యాగము, సేవాపరాయణత స్త్రీలింగమునకు జెందినవి. కాని ధైర్యములేనిది స్వార్థత్యాగముగాని, కష్టసహిష్ణుత లేనిది సేవాపరాయణతగాని చేయచొప్పడదు. కాన నొకకార్య సాధనకు స్త్రీపురుషుల తోడ్పాటెట్లవసరమో అట్లే యుభయగుణ సమ్మేళనముగూడ నవసరము. ఇట్టి శంకలకు తావిచ్చెడి యంశము లొకటిరెండున్నను మొత్తముమీద అధ్యక్షుల యుపన్యాసము స్త్రీజనాభ్యుదయ కరములగు పెక్కు దివ్యోపదేశములతోగూడి గంభీరభావభరితమై గమనార్హముగ నుండెను. అనంతరము లక్ష్మీనారాయణ పంతులుగారు గతసంవత్సరకార్యనివేదికమును జదివిరి. తరువాత గురుకుల బాలికల యాటపాటలారంభమయ్యెను. తొలుతనొకబాలిక దైవప్రార్థనముచేసెను. తరువాత నిరువురుబాలికలు గానముచేసిరి. జాతీయగీతమునుబాడిరి. తరువాత కొందరుబాలికలు రామభజనచేసిరి. తెలుఁగు, సంస్కృతము, హిందీ, మూడుభాషలలో నాటకభాగములను ప్రదర్శించిరి. మూడుభాషల యందును వారివాచకము మనోజ్ఞముగనేయుండెను. సంస్కృతమున వారుభాషించునప్పుడు ప్రాచీనఋషికన్యల దలపించిరి.