Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

శారదలేఖలు

ననెడి తలంపుతో తదేకదృష్టితో చిత్తరువులను వ్రాయుచున్న ఉపాధ్యాయులతో విద్యార్థినులతోనున్న చిత్రకళా మందిరము నొకమాఱు కన్నారగాంచి పట్టువస్త్రములపై కద్దరువస్త్రములపై సరిగతోడను పట్టుతోడను విచిత్రలతా వితానములఁ జిత్రింపుచున్న కుట్టుతరగతి బాలల నొకమాఱు మోదమున తిలకించి, వార్షికోత్సవపు ఆటపాటలలో పాల్గొన నాయత్తపడుచున్న కన్యకామణుల గాన కౌశలము నొకమాఱు శ్రవణపేయముగా నాలకించి, తరువాత పాఠశాలను తదితర ప్రదేశములను చూచి యింటికి మరలితిమి.

ఆ తరువాత నాలుగైదుదినములకు వచ్చెవచ్చె ననుకొనుచున్న వార్షికోత్సవపు దినములువచ్చెను. తొలినాటి (1 - 12 - 28) యుదయము నికేతనములో నూతనముగా గట్టబడిన గృహప్రవేశోత్సవము శాస్త్రోక్తముగా జరుపఁబడెనట. దానిని నేను చూడలేదు. ఆ సాయంత్రమువెళ్లి విద్యాలయబాలికలచే తయారుచేయబడిన కుట్టు, పేము, చిత్రముల ప్రదర్శమునమునుచూచి యొకతాతగారు చెప్పిన హరికథ నొకకొంతవిని యింటికివచ్చితిమి. మఱునాడు వార్షికోత్సవము. ఆ యుత్సవసందర్శన కుతూహలురై యితర గ్రామములనుండి స్త్రీపురుషు లెందరోవచ్చిరి. ఇఁక నూరివారి యుత్సాహ యత్నములు చెప్పనే యక్కఱలేదు. గుంటూరునందలి ప్రతి స్త్రీయును ఆనాడు నిద్రలేచినదిమొదలు శారదానికేతమున కేగెడి యత్నములోనే యుండెనని చెప్పవచ్చును. సభారంభము