Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

51

దాదాపైదుగంటలు దాటినది. కాని నా ప్రేమపాత్రమగు శారదానికేతన మచ్చటి కనతిదూరముననే యుండుటచే నాయడుగటుపడెనేగాని యింటివైపునకు తిరుగులేదు. చరమ సంధ్యాకాంతులతో పశ్చిమాశ రాగరంజితమై మనోజ్ఞముగ నుండెను. ఆరుబయలునుండి వీచెడు హోరుగాలి చలిచలిగా నుండెను. నేనారైలుకట్ట ప్రక్కనున్న రప్తాదారినిబట్టి వడివడిగా శారదానికేతమున కేగసాగితిని. నాకు వంటపని యున్నదమ్మా యనియు, నేను పాఠములు చదువుకొనవలసి యున్నది, నికేతనమునకేగి వచ్చునప్పటికి బాగుగా చీకటిపడునేమో ఎట్లాగత్తా? అనియు, నాతో వచ్చిన మావదినెయు, మా మేనగోడలును తొందరించిరి. వారిమాటలు నా చెవి దూరలేదు. నన్ను వీడిపోలేక వారును నావెంటనేవచ్చిరి. సింహ ద్వారమను నామము సార్థకంబగున ట్లిరువైపుల సింహపు మూర్తులుగల సింహద్వారమున నికేతనములోనికి బ్రవేశించితిమి. ద్వారముదాటి నాలుగడుగులు లోనికేగగనే నికేతన పాదపములకు నీళ్లువోయుచున్న గురుకుల వాసినులు మాకెదురైరి. వారిని చూడగనే కణ్వాశ్రమమున చెట్లకు నీళ్లుపోసిన శకుంతలాప్రియంవదలు జ్ఞాపమునకు వచ్చిరి. కాళిదాస మహాకవి యక్షరరూపమున జూపినదానిని నికేతన ప్రతిష్ఠాపకులు ప్రత్యక్షరూపమున జూపుచున్నారుగదాయని లోలోన హర్షించుచు లోనికేగ వార్షికోత్సవమునకు సిద్ధపడెడి యత్నములతో నిండి గై సేయనున్న కాంతవలె శారదానికేతనము గన్పట్టెను. చీఁకటిపడుచున్నను వార్షికోత్సవమునాటికి తయారుకావలె