50
శారదలేఖలు
ఒక సంవత్సరము గడచిన తరువాత మరల నొకమాఱు గుంటూరు వెళ్లితిని. శారదానికేతన మెట్లున్నదని మరల మాసోదరుల బ్రశ్నించితిని. “చక్కగానున్నది. ఒక విశాల సౌధములోనికి మార్చబడినది. చాలమంది బాలికలు గురుకుల వాసినులుగా జేరినారు. ఇపుడు చూచిన సంతృప్తిఁజెందుదువు” అనిరి. వెంటనే వెళ్ళి చూచితిని. నిజముగా పాఠశాల మాఱిపోయెను. ఆ గురుకుల వాసినులగు బాలికలను, జాతీయములగు నా విద్యాపద్ధతులను చూడగనే నా కెనలేని సంతస మొదవెను. తక్షణమే ఆ విద్యాలయము విూదను ఆ విద్యాలయ ప్రతిష్ఠాపకులమీదను నా కెనలేని భక్తిప్రేమలు కుదురుకొనెను. నాడాదిగ నేనెన్నిమాఱులు గుంటూరు వెళ్ళినను ఆ విద్యాలయమున కొకమాఱు వెళ్లి చూడకరాను. స్త్రీల పాలిటి కది కల్పతరువువంటి ప్రతిష్ఠాపనమనియు, ఎవరు స్త్రీ విద్యాభివృద్ధిని కాంక్షింతురో, ఎవరికి దేశభక్తియు జాతీయతాభిమానమును గలదో అట్టి వారెల్లరావిద్యా ప్రతిష్ఠాపనమును నాదరించి పోషింపవలయుననియు నాతలంపు కాన పలుమాఱులాపాఠశాలను దర్శించి వచ్చుచుందును.
మా సోదరులుండుటచే నాకు గుంటూరు ప్రయాణ మేడాదికొకటి రెండుమాఱులు తగులుచుండును. గత మాసాంతమున మరల గుంటూరు వెళ్లితిని. బ్రాడీపేటలో నాకు నీవంటి యాప్తురాలగు స్నేహితురాలుండెను. ఆమెను చూచుటకై వెళ్లితిని, కాని ఆమె యింటలేదు. అప్పటికి