Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

శారదలేఖలు

తిష్ఠ. మీరుచెప్పినట్లు వంకలేని బిడ్డనిచ్చి పెండ్లిచేసినప్పుడే విడనాడుటింత సులువైనప్పుడు కుంటిదనీ గ్రుడ్డిదనీ రోగిష్టియనీ అనాకారియనీ వంధ్యయనీ భార్యను వదలినవారెందరో విచారించండి. ఆడదిమాత్రము పుట్టుగ్రుడ్డికిచ్చినా కిమ్మనరాదు. వింటిరోలేదో నాపెనిమిటి పుట్టంధుడు" అనెను. “అట్లాగా పాపము! అటువంటి పుట్టుగ్రుడ్డి కెట్లాయిచ్చారండీ!” అని అందఱమొక్కమారుగా నంటిమి. ఆమె చెప్పసాగినది. ఆ చరిత్ర ముందు వ్రాసెదనులెమ్ము.


భావపురి

ఇట్లు

1928 నవంబరు

శారద.