శారదలేఖలు
47
వధూవరులకు కొంచము యుక్తవయస్సు వచ్చినమీదట వారి సమ్మతినిగూడ కనుగొని వివాహములు గావించుట క్షేమకరము. శాస్త్రము లనుకూలముగా నున్నవి. ప్రభుత్వమనుకూలముగానున్నది. యువతీయువకు లనుకూలముగానున్నారు. కాన ఆచారముకొరకు చావబోవుచున్న ముసలితొక్కులము మనము ప్రతికూలముగానుండి చేజేత నాడుపిల్లలనేల నన్యాయము చేయవలెను?" అని నమస్కరించెనట. అంతటితో నా తీర్మానమునకు ప్రతికూలముగానున్న పెద్దలనేకు అనుకూలముగా తలయూచిరట. కాన మనస్త్రీ సంఘక్షేమమును కోరువారమైనచో శారదాబిల్లు నామోదింపక తప్పదు” అనియామె చెప్పెను.
ఆ వృత్తాంతమును వినగనే యంతవఱకు శారదాబిల్లుకు ప్రతికూలముగా వాదింపుచున్న తూర్పుగోదావరి ముసలమ్మ "అవును మగవాడు స్వతంత్రుడు. ఆడది అథవస్థపడి కుంటికిచ్చినా గ్రుడ్డికిచ్చినా ముసలికిచ్చినా రోగికిచ్చినా సహించి కాపురంచేయాలి, కాస్తంత నెపంపెట్టి పెళ్ళాన్ని వదిలపెట్టి మళ్లీ పెండ్లాడితే యేడుస్తూ వూరుకోవాలి మఱి? దీనికి తరణోపాయములేదు. ఉభయులు యిష్టపడి చేసుకుంటే యిలా జరగదనుకుంటాను” అనినది. ఇంతలో మాబండి ఒంగోలు దాటినది. మా బండిలోకి మరికొందరు క్రొత్తస్త్రీ లెక్కిరి. వారిలో నొకామె "అవునండి, ఎటువంటి అవిటివాడికిచ్చినా హర్షముతో ఆమోదింపవలసిందే, కాదంటే లోకంలో తలయెత్తరాని అప్ర