Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

శారదలేఖలు

"వేయిమాటలతో నన్ను విసిగింపవలదు. నాకామె యక్కరలేదు. ముమ్మాటి కక్కరలేదు.” ఎందరెన్ని విధముల నడిగినను ఆతడిచ్చు సమాధానమిది, తండ్రి యాతనికి సహాయము.

ఈ విధముగా నెనిమిది వత్సరములు గడచినవి. అతడు బి. ఏ. బి. యల్. పరీక్షనిచ్చి చెన్నపురిలో నొకవత్సరము అప్రెంటిసు చేసి హైకోర్టువకీలు పట్టమునుబడసి స్వపురమునకు వచ్చి వకీలుపని చేయుచున్నాడు. వెనుకటి భార్యవిషయమై జాలి వారికెందుకు? ఎవరో కక్కుర్తి మనుష్యులువచ్చి నాలుగు సంచులు కుమ్మరించి పిల్లనిచ్చి పెండ్లిచేసినారు. ఆపిల్ల యేడాదిలోనే కాపురమునకు వచ్చినది. పసి నిమ్మపండువంటి కొమారుడుగూడ కలిగినాడు. అతని సుఖమేమో అతడు చూచికొనినాడు. కాని యీ భార్యవిషయమై మాత్ర మాతనికి యోచనయేలేదు. అతను సుఖముగా నున్నందుకు నేను విచారించుట లేదు. కాని యీ పతిపరిత్యక్త గతియేమి? కానీపెట్టి కొనిన కాయగూరనైన ఉపయోగ యోగ్యముగా నున్నంతవరకు విసిరి పాఱవేయముగదా! అట్టిచో అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్య నావిద్యాధికు డెంతసులువుగా పరిత్యజించెనో చూడుడు. ఆ కాయగూరలపాటి గౌరవమున కర్షగాదా? అగ్నిసాక్షిగా వివాహమాడిన కళత్రము! ఇట్టివాడు పెద్దమనిషి చదువరీ, పైన న్యాయవాది, స్త్రీలకు ధర్మశాసనముల సాయములేదు, లోక సానుభూతిలేదు, వైవాహిక స్వాతం