Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

41

నడుగ, “అన్నయ్యా! నేనేమిచేసేది? వాడు నాఅదుపుశిక్షలలో లేడు. వాడికా తండ్రిగారు సహాయము. శాంతేమిటి సింగినాదము చేసుకోకపోతే యేమని యిద్దరు ఒక్కమాటగా పల్కుతున్నారు. ఏమిచేస్తాము? అయిననాటికే అవుతుంది. ఊరుకో” మన్నదట అంతటితో పులిమి పుచ్చుకొని మాబాబాయి యింటికి వచ్చినాడు.

మఱిరెండేండ్లు గడచినవి. పిల్లను తీసికొని వెళ్లెడియత్నమేలేదు. పిల్లవాడప్పుడు ఎఫ్.ఏ. ప్యాసయి బి. ఏ. చదువుచున్నాడు. పిల్లకు పదునై దేండ్లునిండి పదునాఱవయేడు అగపడినది. ఈడేరినబిడ్డ నెంతకాలమని యింట నుంచుకొందురు? ఒక వేళ తలిదండ్రులకు భారము లేకపోయినను లోకమునకు భారముగదా. "మీ అమ్మాయిని అత్తవారింటి కంపకుండా వూరుకున్నా రేమండీ" అని నిత్యమడుగు నమ్మలక్కలకు సమాధాన విూయలేక సగము వేసారిపోయినాము. ఏదో ముదుక సామ్యమున్నది వింటిరో, లేదో, కూతురింటికి మఱుగుదొడ్డికి అసహ్యపడుచునైనను పోకతప్పదట. ఆ విధముగానే పిల్లను పోషింపలేని పేదవారివలె మాబాబాయి పిన్ని యిద్దరు కలిసి పిల్లను తీసికొనిపొండి యనిచెప్పుటకు, వియ్యాలవారి యింటి కేగినారు, "మీ కోడలిని మీరు తెచ్చుకొను”డని బతిమలాడి చెప్పినారు. “నాపెత్తనములేదు, ఆతండ్రియిష్టము, ఆకొడుకు యిష్టము.” అని వియ్యపురా లనివేసినది. “పిల్లవాని నడుగుడు, వానికిష్టమైనచో నాకు యిష్టమే"నని వియ్యంకు