Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

శారదలేఖలు

నది. ఒక్క విషయమై ప్రస్తావన వచ్చినదానిపై నూరు వృత్తాంతములు వాకొనుట మనస్త్రీలకున్న నైజమేగదా; ఆమె చెప్పినదిగూడ నొక దీర్ఘకథ. ఇప్పటికే లేఖ కడు దీర్ఘమైనది. వ్రాయుటకునాకు విసువు లేకపోయినను చదువలేక నీవెక్కడ విసుగు కొందువోయని నాభయము. విరమించుచున్నాను. పైకథకు ముందులేఖను కనుము.


భావపురి

మిత్రురాలు.

1928 సెప్టెంబరు

శారద