32
శారదలేఖలు
మంతుడేగాని యా వివాహములతో నతఃపాతాళమునకు క్రుంగిపోయెను. నిండు వార్థక్యమున వివాహఫలముగా మానాయనకు మిగిలినవి యూరినిండ నప్పులు, భార్యతోడి తిప్పలు—యివి రెండే! ఇకతరువాత నప్పులు మెండై భార్యతోడి పోరాటమధికమై విద్యాబుద్ధులు చెప్పింపలేమి మా యన్నలిరువురు దేశద్రిమ్మరులైరి. రమ్ము పొమ్మనువారు లేమి మా యక్క లిద్ద ఱింటికి దూరమైరి. ఇక దిక్కుమాలి చిక్కిన మా చెల్లియు నేనును మా సవతితల్లి చేతిక్రింది బానిసీలమై పడరాని బాధలుపడితిమి. ఇఁక నా దొక్కముక్కచెప్పి ముగించెదను. నా పెండ్లినాటికి నా పెనిమిటికి పదునాఱేండ్లున్నవి. ఆయన యప్పటికే జేనెడుచుట్ట నోటితో, మూరెడు కుచ్చు తలపాగతో, నూరియందలి కొంటె కోణంగులకు మొదలై విద్యాబుద్ధి సంపన్నులగు యోగ్యబాలకులకు వెలియై తిరుగుచుండెను. ఆయన కిక పెండ్లి గాదని యెంచియే తలిదండ్రు లావిధముగా తమ గాదిలి కుమార్తె సుఖమును పణముగానిడి నన్ను బదులుగాగొని పెండ్లిగావించిరి. కూతుండ్ర కాపురము కూలద్రోచియైన కొమరుని నొక యింటివానినిజేయు దురాచారము మనదేశమున ననాదినుండి యున్నదేగదా! కొమరుడే వారిబిడ్డ, వానిక్షేమము విచారింప వలయుటే వారి ముఖ్య కర్తవ్యము. అందుకు కుమార్తెను బలిగావించుట వారి కొక తప్పుగాదోచదు; కడుపున బుట్టిన బిడ్డయైనను నాడుదియైనంత మాత్రమున నెంతనిర్దయయో కనుడు! చెప్పెడిదేమనగా నేను యుక్తవయస్కురాలనగు నప్పటికే నా పెనిమిటి సప్తవ్యసన