30
శారదలేఖలు
పెద్దపాప”మని నేనంటిని. “అవును, మాతల్లిపోవునప్పటికి నావయస్సైదేండ్లు, మా పెద్దక్కయ్యకు పద్దెనిమిదేండ్లు, మా చిన్నఅక్కయ్యకు పదైదేండ్లు, మాపెద్దన్నయ్య పదిరెండేండ్లవాడు, మాచిన్నన్నయ్య యెనిమిదేండ్లవాడు. అప్పటికే మాఅక్క లిద్దఱు కాపురమునకు వెళ్ళినారు. మాపెద్దన్నకు వడుగైనది. తక్కిన పసికూనలమైన మమ్ము కష్టపరంపరలకు గుఱిచేసి మాతల్లి చనిపోయినది. మా నాయనకప్పటి కేబదేండ్లున్నవి. తల పులగము పదునుగా నెఱసియున్నది. అప్పటికి మా పెద్దక్క కొక కొడుకుగూడ పుట్టియుండుటచే తాత గూడయైనాడు. న్యాయమున కాయన వివాహము మాట మనస్సునగూడ స్మరింపరాని సమయమది. అయిననేమి. పాపిష్ఠి లోకము పెండ్లము చావగనే మగవానిని పెండ్లికొడుకును జేయుచుండునుగదా. “నాయనా! వచ్చేది పెత్తనము. ఇంట్లో ఆడదిక్కులేకపోతె ఎట్లాజరుగుతుంది? కోడళ్లు కూతుళ్లు ముప్పుగడుపుతారా? చేసుకున్నదానికంటే తప్పదు. ఏదో పదిరూపాయలు కర్చైనా ఒకచిన్నదాన్ని ముడిపెట్టుకుంటే సరిపోతుంది.” అని బంధువులలోను పరిచయులలోను పెద్ద పెద్దలందఱు పదే పదే సలహా చెప్పుట సాగించినారు. భార్యచావగనే పెండ్లాడుద మనెడి కోరిక మనదేశములో ప్రతివానికి, అందులో యేండ్లుచెల్లినవాని కుండుట సర్వసాధారణమే కదా! మగడు చావగనే మగువ వాంఛ లేవిధముగా నడుగంటిపోవునో మగువ చావగనే మగవాని కోరికలావిధముగా నీరిక లెత్తుచుండును. భర్తృహీన పసిదేయగుగాక, యామెవాంఛ