Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

29

దండ్రులు ఆడపిల్ల నెంత అన్యాయము చేస్తున్నారు? అమ్ముకోవడము, అప్రయోజకుడి కియ్యడము. బదులుకు బదులిచ్చి చేసుకోవడము. ఒకటా అకృత్యము? ఆడపిల్లంటే అమ్మా నాయనలచేతి చెలామణి నాణెము; కాకపోతే పుచ్చినవక్క, చిల్లిగవ్వ, ఎంత నిస్సారం” ఇట్లనుచుండగా నామెకన్నుల నీళ్లు గిఱ్ఱునదిరిగినవి. పలుకులు గద్దదికమైనవి. ఆ స్థితినిజూడ తల్లిదండ్రులచే నామెగూడ నేదియో సంసారపు కష్టమునకు లోనైనట్లుగా నాకు దోఁచెను. ఆమె వృత్తాంతమును పూర్తిగా నెఱుగవలెనని యూహించితిని. కాని యామె నెట్లడుగనగునో, ఏమడిగిన నేమనుకొనునో యని క్షణమాత్ర మాలోచించితిని. తుదకు యేమైన ననుకొననిమ్ము చెప్పిన విందును. చెప్పకున్న నూరకుందును. అడిగిన తప్పేమియని సాహసించి "అమ్మా మిమ్ములనుచూడ చాల కష్టపడినవారుగా గన్పట్టుచున్నారు. తల్లిదండ్రు లనాలోచితముగా గావించిన వివాహమే మీ కష్టములకు కారణమని యూహ గలుగుచున్నది” అని నేను పిఱికిపిఱికిగా వ్యత్యస్తముగా నడిగితిని.

“తల్లికి నేను నోచుకొనలేదు. తండ్రిచేసిన యువకారము వల్లనే యిట్లా అల్లాడుచున్నాను.” ఆమెకు మరల కన్నులనీళ్లు క్రమ్మెను. పైట చెఱగుతో నద్దుకొనెను. ఆమె యిచ్చిన జబాబువలన నాప్రశ్నకు సుముఖయైయున్నట్లు నాకుదోచెను. కాన"పాపము! మీకు తల్లి చిన్నతనముననే పోయినదా? ఆడఁది చేసికొనిన పాపములలో చిన్నతనముననే తల్లి కఱవగుటొక