28
శారదలేఖలు
దని మన దేశంలోగూడ శాసనం వస్తున్నదట గాదా” అని నన్నడిగెను. అవునని నేనంటిని. “ఏమి కానికాలం వచ్చిందమ్మ! అన్నేండ్లు పెంచితే పిల్ల పెద్దమనిషికాదా?” అని యామె యడిగెను. “కావచ్చు”నని నేనంటిని. "అయితే బ్రాహ్మణీకం బండలైపోయినట్లేగా, శూద్రులతోపాటే మనమూను?" అని ఆమె కోపముగా బలికెను. నేనేమియు మాట్లాడలేదు. ఇంతలో ఒక లేబ్రాయపు వితంతువు అందుకొని "పోతేపోనీ పదునాలుగేండ్లయినా రాని పిల్లకు పెండ్లేమిటి? అయిదేండ్ల కుంకకు పెండ్లిచేశారు. ఇట్లా ముసుగేసుకొని యేడుస్తున్నాను. అయినదేమో అయినది. ఇక ముందు వాండ్లకైనా న్యాయం జరిగితే అంతేచాలు” అనెను. “పిచ్చిదానా, ఎవరికర్మము వారిది. ఎవరి నొసటివ్రాలు వారిది. పద్నాలుగేండ్లకు పెండ్లిచేస్తేమాత్రము విధవరికము తప్పుతుందా” అని వెనుక ప్రశ్నించి నామె పలికెను. “పదునాలుగేండ్లలోపు వైధవ్యమైన తప్పుతుంది గాదా? పెనిమిటిసంగతీ పెండ్లిసంగతీ కొంచెమైనా బోధపడుతుందిగాదా? ఇపుడు యే మట్టీలేదుగా, నామట్టుకు నాకు అయిదోయేట పెండ్లిచేశారుట. ఆ తరువాత మూడునెలలకే ఆ పిల్లవాడు పోయినాడట. నాకు ఆ పెనిమిటిపోలికైనా గుర్తులేదు. ఇది న్యాయమని విూరంటారా?” అని యా వితంతువు పలికెను. ముసలమ్మ నిరుత్తరయయ్యెను. ఇంతలో మఱొకస్త్రీ అందుకొని "దేవుని దయవల్ల ఆ శాసనము రావలసినదే; అపుడుగాని యీ తల్లిదండ్రుల ఆటలు కట్టువడవు. రామ! రామ! తల్లి