Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

శారదలేఖలు

వురు “హాకు బేకు” మనుచు కన్నడమున మాట్లాడుచుండిరి. మఱొక బల్లపై దేశస్థ బ్రాహ్మణస్త్రీలు మువ్వురు కూర్చుండి “హైస్ బైస్" యని మహారాష్ట్రమున మాట్లాడుచుండిరి. వేరొకదిక్కున మహమ్మదీయస్త్రీలు నల్వురు కుతకుత నుడికి పోవుచున్న యా మధ్యాహ్నపుటెండలో తెగమాసిన యా మేలిముసుగు దుప్పటులు కప్పుకొనజాలకయు తీసివేయజాలకయు కులస్థుడు కనపడగనే ముసుగును దిగదీసికొనుచు, వెళ్లగనే యెగదీసికొనుచు "కౌనుసీగామ్ గయే, కహసే ఆతీహా" అని ఒకరినొకరు ప్రశ్నించుకొనుచు మాట్లాడుచుండిరి. తక్కినవారు మన తెలుఁగువారు. భాషాపరిచయము కాని యా యపరిచితలతో నేటి ప్రసంగమని చేతిలోనున్న నాటి యాంధ్రపత్రికను తిరుగవేయుచు నేనుగూడ నొకవైపున గూర్చుంటిని. రైలు గూడూరు విడిచెను. బండిలోనివా రెక్కడివా రక్కడ సర్దుకొని కూర్చుండి పరస్పర సంభాషణల కుపక్రమించిరి. ఒక మహమ్మదీయస్త్రీ హిందూస్థానీభాషలో మీ దేయూరని దేశస్థ బ్రాహ్మణస్త్రీల నడిగెను. మాది యిందోరు రాజ్యమని వారనిరి. ఇందూరుమాట వినగానే యీమధ్య జరిగిన శర్మిష్ఠాకల్యాణము జ్ఞాపకమువచ్చి వారితో ప్రసంగింపవలెనని నాకు కుతూహలము కలిగెను. అంత చదువు చున్న పత్రికను ముడిచి, వచ్చియు రాని హిందీముక్కలతో “ఈమధ్య దొరసానిని పెండ్లాడినది మీదేశపు ప్రభువేగదా” యని నేను వారి నడిగితిని. “అవున"ని వారనిరి. "చాల ఆశ్చర్యకరమైన సంగతి” యని నేనంటిని. "పదిరూపాయ