Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

శారదలేఖలు

సంతోషింపుచున్నా"నని చెప్పియున్నాడు. ఖద్దరు వస్త్రములను ధరించుటయనగా నిరుపేదలకన్నమిడుట యన్నమాట. విూశరీరములు స్వదేశీయములేగాని విూరు ధరించిన వస్త్రములు మాత్రము స్వదేశీయములుగా లేనట్లు కన్పట్టుచున్నది. కాన విూరందఱు నూలువడికి స్వదేశవస్త్రముల ధరింపవలెనని కోరుచున్నాను."

మిత్రమా, సరోజినీదేవి యుపన్యాసమునందలి ముఖ్యాంశము లివియని జ్ఞాపకము. వీనిలో నేదైన పొరపాటులున్న నదినావియేయని యెంచుము. మేము వేసవిని చల్లగఁ గడుపవలెనని యిచ్చట కేతెంచితిమి. ఇచ్చట యెండలు తక్కువ. వేడిగాడ్పులసలేలేవు. చెమట పోయుటయేకానము. ఈదినములలో మన ప్రాంతములనుండెడి మండుటెండలు, వేడిగాడ్పులు, చెమట స్నానములు, తనియని దాహములు తలఁచుకొని యీ యూరి యొండలను తలంచినప్పుడు యేపుష్యమాఖమాసపు యొండలుగనో గాన్పింపుచుండును కాని యీ యెండలకే అడలి పోవుచున్నా రిచ్చటివారు. చూచితివా చిత్రము!


భావపురి

నీప్రియమైన

1928 జూలై

శారద.