శారదలేఖలు
23
అంతియేగాదు సర్వమతములవారి యెడలను సర్వ మానవుల యెడను సమస్తభూత జాలముల యెడలను గూడ గలిగి యుండవలెను. స్త్రీలకు సౌందర్యభ్రమ యధికము. సౌందర్యము వెలలేని నగలు ధరించుటలో లేదు. విలువైన చీరలను ధరించుటలోలేదు. మొగమును పలుమారు సబ్బులతో గడుగుటలో లేదు. నిర్మలమును కరుణాభరితమును ప్రేమపూర్ణమునునగు హృదయమును గలిగియుండుటయే స్త్రీకినిజమైన సౌందర్యము. అట్టి సౌందర్యమును మీరు బడయగోరెదను.”
శ్రీమతి సరోజినీదేవి యుపన్యాసమును ముగింపగ ఖద్దరునుగూర్చి కొంచెము చెప్పుడని యొక సభ్యురాలడిగెను. దానినిగూర్చి యామె యిట్లుచెప్పెను.
“ఖద్దరనగా గాంధిగారి సందేశము. గాంధిగారి సందేశమనగా ఖద్దరు, ఈమధ్య ఆఫ్‌గన్ స్థానపుప్రభువు బొంబాయికి వచ్చియుండెను. ఆయన సభలోనికిరాగనే యెక్కువ ముతుక చీరను గట్టియున్న మహాత్ముని భార్యనుచూచి “ఓ, యెక్కువ ముతుకచీరను గట్టియున్న దే యీమెయే గాంధిగారి సతి" యని యామెను గురుపట్టి ఆఫ్ఘన్ రాజు యెంతయో సత్కరించినాడు. ఆయన తన స్వతంత్రరాష్ట్రమునుండితెచ్చిన సందేశమేమనగా "మా రాజ్యమునందు విదేశవస్త్రమునువాడు నలవాటులేదు. నారాష్ట్రవాసులెల్లరు తమ చేతులతో స్వయముగా వడుకబడి నేయబడిన గుడ్డలనే ధరింతురు. ఎంత శ్రీమంతులైననుగూడ ఆఫ్గనులు స్వదేశవస్త్రములనేగాని విదేశవస్త్రముల ధరింపరు. ఈవిషయమై మీకు సందేశ మీయగలిగినందులకు నేను చాల