Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

21

యున్నారు. బాలికలకు విధిగా విద్య నేర్పవలెననినారు. స్త్రీలకు నియోజక నియోజిత స్వాతంత్య్రము కావలెననినారు. అతిబాల్య వివాహము లనిర్ధకమనినారు. ఇంకను పెక్కు తీర్మానములు గావించియున్నారు. పై విషయములను గూర్చి మనదేశమునందు తీవ్రమైన యాందోళన జరుగుచునేయున్నది. కొన్నిట మనకనుకూలములుగూడ జరుగుచునేయున్నవి, ఇతర విషయములలో మన దేశపుస్థితి యెట్లున్నను నియోజిత నియోజక స్వాతంత్ర్యము మాత్రము మన స్త్రీలకు శీఘ్రముగానే లభించినది. పాశ్చాత్య స్త్రీలు విశేష పరిశ్రమచే గాని బడయజాలక పోయిన ఎన్నిక హక్కులు మనదేశపు స్త్రీలకు సులభముగా లభించినవి. తత్ఫలితముగా మీ మదరాసు రాష్ట్రశాసనసభకు ఒకస్త్రీ డిప్యూటీ ప్రెసిడెంటుగా నెన్నుకొనబడి యున్నది. తిరువాన్కూరులో నొకస్త్రీ మంత్రిణిగా నియమింపఁబడి సమర్థతతో నిర్వహింపుచున్నది. ఇంకను పెక్కు స్థానికసభలలోను విద్యా సంఘములలోను స్త్రీలు సభ్యురాండ్రుగా నియమింపఁబడుచున్నారు. కాని యీ స్వాతంత్ర్యపు హక్కులు సమర్థతతో నిర్వహింప గోరుచో స్త్రీలు మంచి విద్యావతులుగా నుండవలెను. మనదేశపు స్త్రీల విద్యాభివృద్ధికి బాల్యవివాహములు ప్రతిబంధకముగా నున్నవి. వానిని రూపు మాపవలెను. మీరు లక్ష్మీపూజచేయుదురు, సరస్వతీ పూజచేయుదురు. గాని మీ బిడ్డలకు లక్ష్మీ ప్రసన్నతలేదు. సరస్వతీ ప్రసన్నత యసలేలేదు. లక్ష్మియన వేరేలేదు. సరస్వతి యన వేరేలేదు. స్త్రీ శక్తి స్వరూపము. కాన స్వశక్తిచే స్త్రీ,