Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

శారదలేఖలు

ప్రతివాక్యమును నొక మహనీయుఁడు తెలుఁగుచేసి చెప్పెను. శ్రీ సరోజినీదేవిగారి యుపన్యాస సారాంశ మీవిధముగనుండెను.

"సోదరీమణులారా!

నేను నా కొమార్తె కనారోగ్యముగా నుండుటచే నిక్కడకువచ్చి యుంటిని. నేను వచ్చిన సందర్భము సంతాపకరమైనదేయైనను మిమ్ములనందఱను గలిసికొనుట సంభవించుటచే నాకు మిగుల సంతోషకరముగా నున్నది. నేను తెలుఁగుదేశపు స్త్రీని కాకపోయినను మీభాషా పరిచయము నాకు లేకపోయినను నేనుగూడ మీస్త్రీజాతికిఁ జెందిన దాననగుటచే మీకును నాకును సన్నిహిత సంబంధముగలదు. మీ సమాజ స్థాపకురాలగు కజిన్సుదొరసానిగారు ఐరిషుదేశపుస్త్రీ. సర్వ విషయములను నామెకును మీకును నెంతయో భేదముగలదు. అయినను ఆమెవచ్చి మనదేశమున స్త్రీ సమాజమును స్థాపించి స్త్రీల యభివృద్ధికై పాటుబడుటకు గారణము ఆమెకును మీకునుగల స్త్రీత్వమే గదా. ఈమధ్య ఢిల్లీయందు భారత మహిళాసభ జరిగినది. దానికి అధ్యక్షురాలు భోపాలు బేగముగారు. అమె మహమ్మదీయ స్త్రీ. ఆసభకు పూర్వము జరిగిన సభ కధ్యక్షురాలు బరోడామహారాణిగారు. ఆమె హిందూ యువతి. చూడుడు. ఒకామె హిందువు. ఒకామె ముసల్మాను. అయినను సభా విషయములలో నెట్టి యసందర్భము గలుగ లేదు. కాన ఆశయ మొక్కటైనపుడు జాతి మత భేదము లేవియు నడ్డుకొనవు. పైడిల్లీ మహిళాసభవారు స్త్రీలకు సంబంధించిన పెక్కువిషయములనుగూర్చి చర్చించి