Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

9

నాంబా' యని సంభోధింపుచు లెంపలు వాయించుకొని సాష్టాంగ పడుదురు. చిన్నలుమొదలు పెద్దలవఱకు 'మా అమ్మణ్ణి మా అమ్మణ్ణి' యని బహుప్రేమతో మన్ననమీర చెప్పుచుందురు. ఊరిలో మెఱవడికి వచ్చినప్పుడుగూడ స్వామికి కంటె నమ్మణ్ణికి నమస్కరించువారే యధికము. అమ్మణ్ణి త్రోవ నెదురపడినచో రక్షకభటులు తమ యెఱ్ఱటోపీని దీసియు, నధికారులు తమ తలపాగ దీసియు నమ్మణ్ణికి నమస్కరించి యామె కుంకుమను నొసట బెట్టుకొనక నావలపోరు. ఇఁక మన స్త్రీల విశ్వాసము వివరించుటకే సాధ్యముకాదు. ఆమె తమపాలిట కల్పతరువనియే మనవారిభావన. ఆమెను పూజించిన పత్ర పుష్పములేమి పసుపు కుంకుమలేమి ఎంతమాత్రము లభించినను మహద్భాగ్యముగ నెంతురు. ఆ పుష్పాదులను పసపు కుంకుమలను దాల్చినచో దమ మాంగల్యము చిరస్థాయిగ నుండగలదని మనవారి విశ్వాసము. మన స్త్రీల యభీష్టములలో నీ సువాసినీత్వవాంఛ ప్రముఖమైనదిగదా! అట్టి సువాసినీత్వము నమ్మణ్ణి పెంపొందించునను విశ్వాసముగల యప్పుడామెయందు మనస్త్రీలకుగల భక్తి నిరుపమాన మనుటలో నాశ్చర్యమేమి?

అచ్చటి ప్రభువుల కామె యిష్టదైవము. అచ్చటి ప్రజల కామె కన్నతల్లి. అచ్చటి జనులలో పెక్కుమంది యామె నామధేయము గలవారే. తండ్రియందుకంటె తల్లియందు ప్రేమ యగ్గలమై యుండుట మనుష్య సాధారణముగదా. శ్రీకాళ