Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

7

నీకు సాకల్యముగఁదెలుప మానసం బువ్విళులూరుచున్నది. కాన యొకటిగోర నొకటి వ్రాసితినని నాపైఁ గోపింపకుమా!

శ్రీకాళహస్తి పురాతన పుణ్యక్షేత్రములలో నొక్కటి. ఈ పుణ్యక్షేత్రమునకు దక్షిణ కైలాసమని గూడ మఱియొక నామధేయముగలదు. ఇచ్చట స్వామికి శ్రీకాళహస్తీశ్వరుఁడనియు, అమ్మవారికి జ్ఞానప్రసూనాంబిక యనియు పేర్లు. శ్రీ అనగా సాలెపురుగు. కాళ్ళమన సర్పము. హస్తి యన నేనుగు. ఈ మూటికిని ఈశ్వరుఁడు మోక్షమిచ్చెనుగాన భక్తవాత్సల్య చిహ్నముగా నీశ్వరుఁడా మూఁడు జీవముల పేరఁబిలువబడుచున్నాడు. కాని ఈస్వామి నిజనామధేయము నాగలింగేశ్వరుఁడు. శివరాత్రి సందర్భమున నిచ్చట పదిదినములు గొప్ప యుత్సవము జరుగును. దూరస్థలముల నుండి గూడ చాలమంది యాత్రికు లేతెంతురు. మొదటి దినమున స్వామికిఁ గడుగూర్చిన భక్తుడగు కన్నప్ప ధ్వజారోహణము. మఱునాడు స్వామి ధ్వజారోహణము. ఆదినమునుండియు స్వామి, పూటకొక వాహనముపై రెండు పూటల పదిదినము లూరేగును. వాహనములలో పెక్కులు వెండివి. ఒకటి రెండు మాత్రమే లక్క, కొయ్య మున్నగువానితోఁ జేసినవి. నిత్యము స్వామితోఁబాటు విఘ్నేశ్వరుఁడు, కుమారస్వామి యను నిద్దరు కుమారులును, కన్నప్ప, చండికేశ్వరులను నిరువురు భక్తులును, గంగ, జ్ఞానప్రసూనాంబిక యను నిరువురు దేవేరులును గూడ నూరేగుదురు. గంగ స్వామికి ప్రక్కనేయుండును. కాని