ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శారదలేఖలు
5
నవ్వువచ్చెను. ఇది తెలుఁగు దేశమే యైనను నీదత్తమండలములకును మన ప్రాంతమునకును ఎంతయో వ్యత్యాసము కలదు. ఇచ్చటి దేశ్యపదము లన్యభాషాపదములవలెనే అబోధకములై ప్రయత్నపూర్వకముగా నేర్చుకొనవలసివచ్చినది. ఆ విషయములనెల్ల మరియొక కమ్మయందు లిఖించెదను.
భావపురి
నీప్రియచెలి,
1928 సం॥ మార్చి
శారద.