4
శారదలేఖలు
యూరు వెళ్లవలసివచ్చినను తదనుగుణ్యముగ బ్రయాణమగుట నేర్చుకొంటిని.
తఱుచు మార్పులు గలుగు చుండెడి యుద్యోగికి యిల్లాలైన స్త్రీ కొద్ది యుపకరణములతో గృహకృత్యములను పచనకార్యములను నెరవేర్చెడి నేర్పును గలిగియుండవలెనని నే నిప్పుడు నా యనుభవమువలన తెలిసికొన గలిగితిని. మన యాంధ్ర స్త్రీలు అందు ముఖ్యముగ నుత్తర సర్కారులకుఁ జెందిన మన మీ విషయమున అసమర్థలమని యొప్పుకొనక తప్పదు. ఊరగాయ జాడీలకు, పచ్చడి బానలకు మాత్రమే రైలులో నొకపెట్టెయు యింటియందొక గదియు మనకుఁ గావలయును. కావుననే "తమిళ స్త్రీలవలె మీకు క్లుప్తత చేతగాదు. ప్రయాణమునకు మీరు పనికి రా"రని మగవారనుట మనకు పరిపాటియైనది. ఈ మధ్య మన ప్రాంతమునుండి యొక రీగ్రామమున కుద్యోగసందర్భమున నేతెంచిరి. వారి సామాను నాలుగైదు బండ్లనిండ యుండెను. అయిదాఱు మంచములను గూడ దెచ్చిరి. ఈ ప్రాంతమున మంచముల వాడుకొను అభ్యాసములేదు. శిశువులు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, నిండుచూలింతలు, పచ్చి బాలెంతలుగూడ క్రిందనే పడుకొందురు. కాన పైఁజెప్పిన వారి సామానులను ముఖ్యముగా మంచములను బండ్లనుండి దింపుచుండగా నిచ్చటి వారాబాలవృద్ధు లతిచోద్యముతో సర్కసు కంపినీవారి సామానును చూచినట్లు మూగిమూగి చూడసాగిరి. నా కూరక