2
శారదలేఖలు
స్వాతంత్ర్యమునకును, ప్రభుత్వ సభలలో స్త్రీలహక్కులకును ఆందోళనమును గావించుటయు స్త్రీలయందు గలిగిన తీవ్ర ప్రబోధమునకు దార్కాణములని చెప్పవచ్చును.
ఈసంవత్సరము మద్రాసునందు జరిగిన సంఘసంస్కార సభ కేవలము స్త్రీజనాభ్యుదయచింతనమునకై యేర్పడిన సభయనియే చెప్పిన చెప్పవచ్చును. దాని కధ్యక్షుడు సుప్రసిద్ధ సంఘ సంస్కర్తయగు నటరాజనుగారు. ఇక నాహ్వాన సంఘాధ్యక్షత నెవరు వహించి రను కొంటివి? చెన్నపురి శాసనసభోపాధ్యక్షురాలును, నిరంతరము స్త్రీజనాభ్యుదయకరములగు తీర్మానములు సభయం దుపపాదించి ప్రజలను ప్రభుత్వమును గూడ తొందరించుచున్న విదుషీమణియు పవిత్ర భారత వర్షమునకు కళంకదాయకమును భారతస్త్రీల సద్యశస్సును మలిన పఱచుచున్నట్టియు మిస్‌మేయో మున్నగు రంధ్రాన్వే షకురాండ్రయాక్షేపణల కాస్పదమిచ్చుచున్నట్టియు కళావంతుల సంఘము, నుద్ధరింప కంకణము గట్టుకొనిన సాధ్వీమణియు అహర్నిశలు స్వజాత్యభివృద్ధికై కృషిచేయుచున్న పరోపకార పారీణయునైన శ్రీ డాక్టరు ముత్తులక్ష్మిరెడ్డిగారు. స్త్రీలయున్నతి మనః పూర్వకముగ నాశించు మహనీయుడు అధ్యక్షుడుగను, నిరంతరము స్వజాత్యభివృద్ధికే పాటుపడెడు నారీరత్నమాహ్వాన సంఘాధ్యక్షురాలుగను నేర్పడినప్పు డిక మన యభివృద్ధిని గూర్చిన విషయములే యందధికముగఁ జర్చకువచ్చెననిన అందాశ్చర్యమేమి? అందు స్త్రీవిద్యను గూర్చియు, ప్రౌఢ వివాహములను గూర్చియు, పునస్సంధాన వయోనిర్ణయమును