200
శారదలేఖలు
దులు. గృహస్థులు క్రొత్తకోడండ్రను, కూతుండ్రను తెచ్చుకొనుట. కాపులకు కోడిపందెములు. వైష్ణవాలయములలో ఉదయపూజలు. వేయేల, ఐహికాముష్మిక లాభంబులను శారీరమానసికాత్మీయ సౌఖ్యంబులను నుత్తరాయణపుణ్యకాల మొనగూర్చుచున్నది. ఈశ్వరానుగ్రహంబున ప్రజలు శీతవాతాది క్లేశంబులనుండి విముక్తులైనారు. ధనధాన్యంబు లింటికిఁజేరినవి. చూడిపశువులెల్ల పాడిపశువులై పాలుపెరుగులు కొల్లలుగావించినవి. ఇళ్లువాకిండ్లు చక్కగానలంకరించుకొనినారు. నిన్న మొన్నటివఱకు కోతవేతలకుబోయి కూలిగింజలు పుష్కలముగా సేకరించుకొనియుండుటచే కూలినాలిజనములకుగూడ నీపండుగ కడుపునిండినపండుగ. కాన ఈపండుగదినములలో మృష్టాన్న మారగించనివారే యుండరు.
నెచ్చెలీ! నీవును పతిసంతానయుతవై రమణీయమును మహోత్సాహదాయకమును నగు నీజాతీయారోగ్యోత్సవానందమును పరిపూర్ణముగా ననుభవించెదవు గాకయని మనఃపూర్వకముగ వాంఛించుచున్నాను.
భావపురి
ఇట్లు
1 - 1 - 31
శారద.
శారద లేఖల మొదటి సంపుట మిది, సంపూర్ణము.
Printed At the Lodhra Press, Egmore, Madras.