Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

199

కొనుటయు మనకు విధిగానేర్పడినది. అప్పుడువేసిన ఆవుపేడ కస్తూరికి తుల్యమని ఆయుర్వేదజ్ఞులమతము. కాన గోమయముతోడిపని మనకీదినముల నధికముగా కల్పించియున్నారు. ఈవిధముగా నీధనుర్మాసము మన ఆరోగ్యముకొఱకే పిన్న పెద్దలనెల్లర నిటు కార్యపరతంత్రులనుగా జేయుచున్నది.

అయినను ఈపనులబాధ ఇకనెన్నిదినములోలేదు లెమ్ము. పండుగ పదిదినములలోనికి వచ్చినది. ఈనెల పదునాల్గవతేదీ యందు సూర్యుడు మకరరాశియందు ప్రవేశించును. అదియే ఉత్తరాయణారంభము. అదియే పుణ్యకాలము. ఎప్పుడు సూర్యు డుత్తరాయణగతుడగునో అప్పుడే ఆమార్తాండుని కిరణజాలంబులు తీక్ష్ణతగాంచును. ఆలోకబాంధవుని తేజఃకిరణ ప్రసరణచే చరాచరాత్మకంబగు విశాలవిశ్వంబెల్ల నవశక్తిని బడసి తేజోవంతమై విరాజిల్లును. మిత్రమా! ఈపుణ్యకాలమునందు మనమేగాక అన్నిమతములవారును, అన్నితెగలవారును, అన్ని దేశములవారును నీపండుగలజేసికొనుట గమనింపదగిన విషయము. క్రైస్తవుల కీదినములలో సంవత్సరాది. బ్రాహ్ముల కీదినముల బ్రహ్మోత్సవము. మహమ్మదీయులకు గూడ నివి పండుగదినములే.

ఇక మన హిందువులపండుగవిశేషములు చెప్పనక్కఱయేలేదు. పసిబిడ్డలకు భోగి పండ్లు, ఆపైవారికి బొమ్మలు పెట్టుకొనుట. వారికంటె వయస్సున పెద్దయగు యువతులకు సావిత్రీగౌరీవ్రతము. నైష్ఠికులగువారికి స్నానదానతర్పణా