శారదలేఖలు
195
గూడ మేమిటులనే గొబ్బిళుల కావుపేడ దొరకనినాడు ఆశాభంగమునొందిన దినములు నాకు జ్ఞాపకమువచ్చినవి. ఈ పసిబిడ్డ లీ చలిలో మంచులో గొబ్మిళ్లమీది ఆసక్తిచేత వచ్చినందులకైన పట్టెడుగోమయ మివ్వవచ్చునే! ఈ మాసము గడచిపోయిన వెనుక నీపసిబాలలు మనయిండ్లకు రమ్మనినను వత్తురా? ఈ నెలదినములు బాలికల కావుపేడ వదలివేయరాదా? అనుకొని మాపనిమనిషి శుద్ధికై తెచ్చిన ఆవుపేడ వారికిచ్చి మాదొడ్డిలోనున్న యేపిచ్చిపూలో నాలుగు పుణికి యిచ్చి వారిని పంపివేసితిని. అప్పుడా బాలికలు గొప్ప పెన్నిధి లభించినట్లుబ్బుచు తమయింటికి వెళ్లినారు.
ఈ బాలికలు గొబ్బిళులు పెట్టుగొనుటనిన నాకు మిక్కిలి సంతసముగానుండును. మఱియు వీరు సందెగొబ్బి పెట్టుకొని గొబ్బితట్టుచుండుట చూచుట, నాకు మిక్కిలి సంతోషకరము. ఒక్క గొబ్బిపండుగ మన బాలికలకు పెక్కు విషయములలో పరిజ్ఞానముగలిగించును. బద్ధకములేక తెల్లవాఱుజాముననే లేచుట, వాకిలి పరిశుభ్రపఱచుకొనుట అట్లుండ పుష్పపత్రాదులతో పరిచయము, మతసంబంధమగు పూజాపునస్కారములతో పరిచయము, మ్రుగ్గులతో పరిచయము, ఆటతో పరిచయము, పాటతో పరిచయము ఈ విధముగా లలితకళలలో ప్రథమపాఠములు బాలికలు గొబ్బి పండుగలలో నేర్చుకొందురు. ఆతరువాత పెద్దపండుగ మూడుదినములు బాలికలు పెట్టుకొనెడి రకరకముల బొమ్మలసా