Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

189

గేండ్ల వివాహములు శాస్త్రవిరుద్ధములని వాదించు పూర్వాచారపరాయణులు ; వేఱొకరు యుక్తవయస్సు వచ్చిన బాలికలకు వివాహముచేయుటకు మనస్ఫూర్తిగా నిష్టముండియు మన వైవాహిక హక్కును ప్రభుత్వపరముచేయుట గూడదను లౌక్యులు. చట్టమున కనుకూలురగు సంస్కర్తల చిత్తములందు గూడ నీ వివాహాధికారమును గోల్పోవుటనునది గొప్ప సమస్యగానే యుండెను. కాని దేశములో బాల్యవివాహములవలని యనర్థకములు నానాటికి మెండుగుటయు, ఎన్నివిధముల ప్రబోధించినను ప్రజాసామాన్యము తమపూర్వాచారమును వీడజాలకుండుటయు గని స్త్రీల పురోభివృద్ధి నాశించు కొందఱు మహాశయులు ప్రభుత్వమువారి వలననైన నీ బాల్యవివాహములు నిరోధింపబడిన జాలునని తమ హక్కును కోల్పోవుట కొడబడిరి. అయితే యీ సవరణయే నెగ్గినేని దేశమును కింతకంటె అనర్థకమును దేశీయుల కింతకంటె యవమానమును వేఱొండు లేదు. ఏలననగా ఎప్పుడు మన బాలికల వివాహమును చేసికొనులకు కోర్టువారి సర్టిఫికెట్టును బడయు టగత్యమైనదో అప్పుడే మన వివాహముల హక్కును ప్రభుత్వమువారి పరము చేసినట్టులైనది. అయితే శారదాచట్టమును సృష్టించుటయొక్క యుద్దేశము బాల్యవివాహములను నిషేధించుటకే గదా. బాల్యవివాహములను చేసికొనువారికి ప్రభుత్వమువా రుత్తరువు నొసంగినచో శారదాచట్టముయొక్క ప్రయోజన మేమున్నది? కాన కలిగియున్న అధికారమును కోల్పోవుటయు, కలుగవల