Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

శారదలేఖలు

అతిబాల్యవివాహము లా విధముగా ననిరోధకముగా నసంఖ్యాకముగా జరిగిపోయిన పిమ్మట, అభము శుభము నెఱుగని పసిపాపల కంఠములకు పూర్తిగా నురులు వేయబడిన పిమ్మట, ప్రజానురాగము బడసిన ప్రజాప్రతినిధులెల్లరు శాసనసభలు వీడివచ్చిన పిమ్మట, గడువుకాలము గడచిపోయి శారదాచట్ట మములులోనికివచ్చి మూడుమాసములైన పిమ్మట యిప్పుడా సవరణ? ఆ సవరణయైన యెట్టిది? సివిలు కోర్టుద్వారా సర్టిఫికెట్టు పొందినవారికి చట్టములో పొందుపరుపబడిన వయస్సులకు లోపుగనే తమ బిడ్డలకు వివాహము చేయుటకు సురపత్ సింగుగారి సవరణ అవకాశ మొసంగుచున్నది. అయితే ఇక శారదాచట్ట మెందులకు? బాల్యవివాహములను చేయ నెంచువారెల్ల కోర్టులో దరఖాస్తుపెట్టి సర్టిఫికెట్టును పొంది తమ పిల్లల కెప్పటియట్లు వివాహముజేయుదురు. ఆక్షేపణలేనివా రొకరి సలహా లేకయే తమ కొమార్తెలకు ప్రౌఢవివాహములను చేయుచున్నారు. ఇకనేమున్నది? శారదాచట్టము బ్రతికియుండియు చచ్చిన చందమగును. సర్టిఫికెట్టును బడయుట కేదైన కొంచెము ఫీజుగూడ నున్నచో కోర్టువారి కదిగూడ నొక ఆదాయకారణము గావచ్చును. వానిలో నేదైన తకరరు వచ్చినచో లాయరులకుగూడ నొకింత సంపాదనాహేతువు కావచ్చును. కల్పలతా! శారదాచట్టము జీవచ్ఛవముగా నుండి చేయుపని యింతియేగాదు; మఱియొక ముఖ్యమైన నష్టమును గలదు. దేశములో శారదాచట్టమునకు ప్రతికూలురుగానున్నవారు రెండు విధములుగానుండిరి. వారిలో నొకరు పదునాలు