ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శారదలేఖలు
185
దేనిచేతను దుఃఖపడలేదు.” అనువాక్యమునుగూడ చేర్చిన బాగుండుననుకొంటిని. కల్పలతా! అది సత్యముగదా ? పరమేశ్వరానుగ్రహమువలన మద్యనిషేధప్రచారము మనదేశమున శీఘ్రకాలములో ఫలించుగాక! మనస్త్రీల దుఃఖములు నివారణమగుగాక! యని వాంఛించెదను. కల్పలతా! ఇప్పటికిని మద్యనిషేధప్రచారముతో స్త్రీలకు సంబంధము లేదనియే తెలంతువా ?
భావపురి
మిత్రురాలు,
ఆగస్టు 1930
శారద.
̺