Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

శారదలేఖలు

వము శల్యావశిష్టులగు నాయింటివారి ముఖములమీదను, సర్వశూన్యమైన యాయింటియందలి నలుమూలలను పొడకట్టుచుండును. కల్పలతా! ఈసందర్భమున 'ఆరోగ్యప్రకాశిక'లో సారాదేవత పలికినపలుకులు ఎంతయు వినదగినవిగానున్నవి. అంటున్నది:-

"ప్రపంచమున మనుష్యులను చంపుటలో అనగా హత్యనేరముచేయుటలో నన్నుమించినవారు మరెవ్వరును లేరు.

ప్రపంచమున నిదివరకుజరిగిన యుద్ధము లన్నిటిలోను చంపబడినవారిమొత్తము సంఖ్యకంటె నాచే చంపబడినవారి మొత్తము సంఖ్యయే మిక్కిలి హెచ్చుగానుండును.

నేను మనుష్యులను పశువులక్రింద మార్చితిని. నేను కోట్లకొలదికుటుంబముల సౌఖ్యమును రూపుమాపి కష్టములనే అనుభవించునటుల చేసితిని. కోట్లకొలదిమనుష్యుల అధోగతికి కొనిపోవునట్టి దారిని సరిచేయుచుందును.

నేను బలవంతులను బలహీనులనుగా చేయుదును. బలహీనులను అంతమొందించెదను. నేనిదివరకు ఎన్నికోట్ల మందినో పాడుచేసితిని. ఇంకను ఎన్నికోట్లమందినో పాడుచేయుటకు ప్రయత్నించెదను. నాపేరే సారాదేవత.”

మిత్రమా ! 'ఆరోగ్యప్రకాశిక'లో ప్రచురింపబడిన గిబ్బనుదొరగారి యీమహావాక్యములను చదివినప్పుడు "ప్రపంచములో నాచే దుఃఖింపబడినంతమంది పతివ్రతలు, మరి