Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

183

వగమ్యముగానున్నది. దొరతనమువారికి మద్యపాన మిష్టమా? అయితే ఆ టెంపరెన్సుకమిటీల కర్థమేమి? మద్యనిషేధ మిష్టమా? అయితే ఇంతమంది దేశభక్తులు కారాగృహ నిబద్దులు కానేల? మద్యనిషేధమును బోధించినందులకై యింతమంది దేశభక్తులు నిబద్ధులగుటజూడ “మద్యనిషేధమున కేర్పఱచిన టెంపరెన్సుకమిటీలు మీ కండ్లనీరుదుడుచుటకై యేర్పడినవేగాని నిజమైనప్రచారమునకుగాదు. మీ నైతికవిచ్ఛిత్తితో మాకుపనిలేదు. మీ సంఘక్షీణతను మేము పరికింపము. మీ దారిద్య్రస్థితితో మాకు సంబంధములేదు. మీదేహారోగ్యముతో మాకు నిమిత్తములేదు. మీ పెండ్లాముబిడ్డల ఘోషతో మా కగత్యములేదు. మాకుకావలసినది డబ్బు. డబ్బు డబ్బు. మద్యనిషేధమున కంగీకరించి మా కోట్ల కొలదిధనమును కోల్పోవజాలము." అని ప్రభుత్వము ఖండితముగా చెప్పుచున్నట్లున్నది. ప్రజల నింతబలవంతపఱచి త్రాగించినను యీ మద్యపానమువలన మనుష్యున కే కొంచెమైన ప్రయోజనము గలదా ? ఆకలితీరునా? ఆరోగ్యవర్ధకమా ? తుదకు జిహ్వకైన ని పుగూర్చునా? ఏదియులేదు. త్రాగుబోతుకు మనస్సు నిలుకడలేదు. మాట నిలుకడలేదు. శరీరములో సత్వములేదు. నైతికముగా, సాంఘికముగా, ఆర్థికముగా, శారీరకముగా వాడు భ్రష్టుఁడై పోవును. వానితోబాటు వానిభార్యయు బిడ్డలునుగూడ వివిధకష్టములకుగుఱియై దురపిల్లుదురు. సారాదేవత ప్రవేశించినయింట ఆనందమునకు తావులేదు. సుఖమునకు తావులేదు. పెద్దమ్మయొక్క ప్రభా