శారదలేఖలు
179
వాంఛితము నీడేర్పజాలక దుఃఖించుటయు గలభాగమువచ్చెను. మిక్కిలి జాలిగొలుపు నాపట్టును దుఃఖావరోధముచే వడివడిగా జదువజాలక ఆపి, ఆపి చదువుచున్న నేనొకమా ఱకస్మాత్తుగా తలయెత్తి నామిత్రురాలివంక చూచితిని. ఏమి చెప్పుదు నప్పటి దృశ్యము? నామిత్రురాలి కన్గవనుండి సంతతధారగా బాష్పములు స్రవించుచుండెను. ఆకన్నీటిధారలు చూడగనే నాగుండె లవిసిపోయెను. అంతనేను నామిత్రురాలితో “రుక్మిణీ! ఇదేమి ఇట్లాఏడుస్తున్నావు ? కల్పితగాథలు సత్యములని భావించుచున్నావా ఏమి ? ఎబ్బే ఏడ్పుమానూ; కథచదవడం మానివేస్తా” నంటిని "నిత్యము అనుభవములోనున్న కష్టములు, దుఃఖములు నీవు చదువుట మానివేస్తేమాత్రము తొలుగుతాయా? కథ ఆపవద్దు. శారదా ! చదువుము. చదువుము.” అని నామిత్రురాలు దుఃఖగద్గదికంబగు స్వరముతో బల్కెను. నాచే మిక్కిలి యదృష్టశాలినియని భావింపఁబడుచున్న నామిత్రురాలి జీవితమింత దుఃఖభాజనమైనదని యాకస్మికముగా దెలియుటచే నేను నివ్వెఱ జెందితిని. నేనెప్పుడును ఊహింపని యొక రహస్యము నాపుస్తకమట్లువిచిత్రముగా బయటపెట్టెను. నా కిక కథ చదువుటకు బుద్ధిపుట్టలేదు. చేతిలోని పొత్తమును క్రిందవేసి నామిత్రురాలి నోదార్చుచు "రుక్మిణీ ! నీపెనిమిటి కిట్టి దురభ్యాసమున్నదా? ఒకనాడును చెప్పకపోతివి!” అంటిని. “ఏ మొగముపెట్టుకొనిచెప్పను? బి. యే. చదువుచుండగానే సారాదేవత మాయిల్లు నాక్రమించినది. ఆనాటినుండి యీనాటివఱకు ఆసారాదేవతవలన నేను పడుచున్న