178
శారదలేఖలు
పేదభారతీయుడు భరింపజాలని యధికపు పన్నులును నెంతతగ్గిన భారతదేశమునకంతశ్రేయము; కాని త్రాగుడుకును వీనికిని పోల్చినచో వీనికంటె త్రాగుడువలని నష్టమే యధికతమమని రూపించుటకే యట్లుపల్కితిని.
త్రాగుబోతువానిభార్య కూలివాని పెండ్లామగుగాక, జమీందారునిఇల్లాలగుగాక ఆమెదుఃఖము వివరింపరానిది. ఇఁక నామె సంతానవతియేయగునేని నా దుస్థితి వర్ణించుటకే శక్యముగాదు. ఈసందర్భమున ఒకవృత్తాంతము జ్ఞాపకము వచ్చుచున్నది. అది యిప్పట్టున వివరించుట అప్రస్తుతప్రశంస కాదనుకొందును. ఇప్పటికి కొన్నియేండ్లయినది — ఒకనాడు నేనొక త్రాగుబోతుకథను నా ప్రియస్నేహితురాండ్రలో నొకామెకు చదివి వినిపించుట తటస్థించెను. ఆమె ఆకధను చదువుమని కోరుటచేతనే నేను చదువుటకు పూనుకొంటిని. నేను చదువుచుంటిని. ఆమె వినుచుండెను. ఆకథలో త్రాగుబోతు భర్తవలన నాతనిపత్ని పడెడిబాధలు, వినినకొలది నామిత్రురాలివదనము వివర్ణమై మ్లానమైపోవుచుండెను. ఆకథా సందర్భములు మిక్కిలి జాలికరముగానుండి నాకు చదువుటకుగూడ నోరాడకుండునంతటి దుఃఖమును గల్గించుచుండుటచే కథా నాయకియందలి కనికరముచేతనే నా మిత్రురాలట్లు విచారపడు చుండెననుకొంటిని. కథలో మితిమించిన పెనిమిటిత్రాగుడుచే నాకుటుంబిని నిర్ధనురాలగుటయు, అవ్యక్తులగు నామెబిడ్డ లదిగావలయు నిదిగావలయునని తల్లిని పీడించుటయు, ఆమె వారి