Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

శారదలేఖలు

ములు గుల్లయైపోవ తిన తిండి, కట్ట బట్ట లేకఅల్లాడు పేద కుటుంబినులును వారికి జే జే లర్పింతురు.

ఇఁక నేకారణముచేనైన నీ ధార్మికోద్యమములోఁజేరి సేవచేయజాలని సాధ్వుల కర్తవ్యమేమియో విచారింతము. ఏధర్మమునకైనను నేసత్యమునకైనను మనము నిక్కువముగా నర్పించవలసినది అంతఃకరణము. అంతఃకరణమే దాని కీయబడదేని కన్నులు చూచుగాక ! చెవులు వినుగాక ! జిహ్వలు పలుకుగాక ! చేయి చేయునుగాక ! దానిలో సారస్యములేదు. నిర్మలాంతఃకరణమే దాని కర్పితమయ్యెనేని నివియన్నియు నిబద్ధమైనను నాధర్మమునకు హానిలేదు. ఆసత్యమునకు చెఱుపులేదు. కాన మహాత్ముని ధార్మికోద్యమమును మనము మనస్ఫూర్తిగా నంగీకరించితిమేని యెవ్విధముననైన తోడ్పడగల్గుదుము. చంద్రుని కొక నూలుపోగన్న సామ్య ముండనేయున్నది గదా. అది కేవలము సామెతయేగాదు. అఖిలభారతీయ హృదయాకాశము షోడశకలాపరిపూర్ణుడై వెలయుచున్న మహాత్మాగాంధీచంద్రుడుగూడ ఆ నూలుపోగునే కోరుచున్నాడు. రాట్నమువలననో తకిలీవలననో ఆ నూలుపోగునైన సాధించి మహాత్ముని కర్పించమేని, యానూలుచే నేయబడిన వస్త్రముల ధరించమేని మనజన్మమే వ్యర్థము. కల్పలతా! నీవు రాట్నముపెట్టితివా లేకతకిలీ నభ్యసించుచుంటివా? నా