శారదలేఖలు
171
లోపు. మనిషి కొంచెము కుఱుచ. ఆకృతిలో ఇంచుక బొద్దు. మేఘగంభీరనినదమువంటి కంఠస్వరము. సుప్రసన్నానములోని యుజ్వలతను గాంచి రక్తరేఖాంచితమైన ఆమె నేత్రయుగళిలో యామె ధైర్యగాంభీర్యముల నేనప్పుడే చదివితిని. ఆమె రెండుపన్యాసములీయ వింటిని. రెండిఁటియందును నామె శౌర్యరస ముట్టిపడునట్టులే భాషించెను. అబ్బో! అపరఝాన్సీ రాజ్ఞి యనిపించుచున్నదే యనుకొంటిని. తదుపరి ఆంధ్రరాష్ట్రసభలో "భారతదేశ మెన్నడును నొరులయాచించి యెఱుగదు. స్వాతంత్ర్యమునుగూడ యాచించదు. నిజప్రజ్ఞచేతనే బడయు”నని యామె పల్కిన పల్కులు మా అన్నగారు నా కెఱిగించిరి. అప్పుడు నేనిచ్చిన నామధేయ మీమెకు తగును అనుకొంటిని. నేనిట్లు తలఁచిన కొలదిమాసములకే శ్రీ దుర్గాబాయమ్మసోదరి రాజధానీనగరనాయకత్వమువహించి ధార్మికసమరము నడుపుటజూడ ఆశ్చర్యమగుచున్నది. సోదరికి జయమగుగాక! ధీరురాలగు దుర్గాబాయమ్మ నాయకత్వము వహించినది. అవకాశముగల చేడియ లందు పాల్గొని యుద్యమము సాగించుచున్నారు. తదితర పల్లీపట్టణములందెల్ల యీ యుద్యమ మిట్లే సాగుచున్నది. దీనిని సాగించుచున్న సోదరీమణుల కార్యదీక్ష సంస్తవనీయమైనది. వారి కార్యపరతచే పేదలపెన్నిధియైన ఉప్పుగల్లు బంధవిమోచనమును బడయునేని, దుష్టమైన మద్యపాన మడుగంటునేని, ఉప్పుగల్లుకు కొఱయైన దరిద్రులును త్రాగుబోతులగు భర్తలవలన సంసార