Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

151

మన హిందూకుటుంబములయందు సాంప్రదాయముగానున్నది. పెనిమిటి యెంత దుర్మార్గుడైనను నేనతని దానినే యనుకొనును గాని ఆతడయోగ్యుడని పరపురుషవాంఛ కలిగియుండు టనునది దుర్జాతిలక్షణము. ఉత్తమురాలగు నేహైందవకుటుంబినియు నట్టి తలంపుకలిగియుండదు. మన హిందూకుటుంబములలో అందును బ్రాహ్మణకుటుంబములలో పతినివరించి పెండ్లాడెడి పద్ధతియింతవఱకు లేదుగదా. తలిదండ్రులు పరిణయము చేసిన వరునియందే యనురక్తులగుట వధువుల ధర్మముగా నున్నది. శారదాచట్టమువలన మునుముందీ వైవాహికపద్దతి మార్పునొందునేమోకాని యిప్పటిపద్ధతి స్వయంవరము కాదు. అట్టిచో అట్టి వివాహము లన్నియు సక్రమము లనియు నట్టివారు పరపురుష సంపర్కము చేసినవారనియు నిర్ధారించుట సాహసము. తలిదండ్రు లెవనికొసంగిన వానినే పరదైవముగా నెంచి ప్రేమించి గౌరవించెడి హిందూస్త్రీలయెడ చిత్తమొకనికి శరీరమొకనికి యొసగుచున్నారని నీవు వ్రాసినవ్రాత మిక్కిలి యనుచితముగా నున్నది. ఇట్టి యూహ హైందవకుటుంబినుల యెడ తలపరాని విషయము. అటుల భావించినచో మన బ్రాహ్మణ స్త్రీలలో వరించి వివాహమాడిన వారెవరు? అందఱము మన జననీజనకులచే నొకరికి దానము చేయబడిన వారమే. కాన నీమతమే నిజమగుచో మనము, మనతల్లులు, సోదరీమణులు, పుత్రికలు, వేయేల మన భారతమహిళ లెల్లరు చెడ్డవారే యనవలసివచ్చును, సోదరీ! మన వివాహసంస్కారమునందు లోపములున్నచో సంస్కరింప