150
శారదలేఖలు
లైన యెక్కువ ఆమోదమును తెలుపుటలేదు. హిందూప్రేమ సంఘమువారాడిన నాటకమును చూచి మహాత్ముడు మోదించెనని వ్రాసితివి? సరియే. కాని ఇన్ని పాశ్చాత్యసాంప్రదాయములతో ఇన్ని అంగరంగవైభవములతో స్త్రీపురుషులు రంగభూమిని అభినయించుటను గూర్చి వారి ప్రత్యేకాభిప్రాయము నడిగితెలిసికొంటిరా? గట్టిగా ఆయన అభిప్రాయము కోరినచో మహాత్ముడెప్పుడును అనుకూలాభిప్రాయ మియ్యడనియే నా యభిప్రాయము. అయినను మహాత్ము డంగీకరించినను యెల్లరంగీకరింపవలెనని సిద్ధాంతమా!
నాటకమనిన కేవలము శృంగారమనియే నా భావనకాదు. అందు నవరసము లొలికింపబడునని నేనెఱుఁగుదును. ఏరసమైనను నేవిలాసమైనను నాటకమనిన కపటసంసారము వంటిదనియు, అందొకచో శయ్యాగృహము, ఒకచో కొలువుకూటము, ఒకచో ఉద్యానవనము, ఒకచో యుద్ధము, ఒకచో శ్మశానము రంగస్థలములుగా నుండుననియు నాకు దెలియును. ఇట్టి భిన్నసమావేశముల కాస్పదమగు రంగస్థలమునందు స్త్రీపురుషుల కలయిక కులాంగనలకు సమంజసమును గౌరవాస్పదమును గాదు. ఈసందర్భమున సోదరీ, నీవు గావించిన హిందూవైవాహికప్రస్తావన మిక్కిలి యసమంజసముగా నున్నది. ఎప్పుడు బాలిక కొక పురుషునితో వివాహము చేయబడునో అతడే తనవాడనియు తదన్యులు పరులనియు, విశేషించి సోదరతుల్యులనియు భావించి యాతని యందే లగ్నచిత్తలగుట