శారదలేఖలు
149
ఆమాట శివాజీ చరిత్రమునందే గలదు. కాని ఆధునిక శివాజీల యుత్పత్తికి నీవు చూపెడి నవరీతులేమో ఆధునిక స్త్రీల వలన నికయెఱుగవలసియున్నది.
కళావంతులనియు, వేశ్యలనియు పిలువబడెడి యొకతెగ వారాంధ్రదేశమున గలరు. నృత్యగీతాభినయాదులు వారి కులవృత్తి. అవివాహితలగు నాస్త్రీలు పురుషులసన్నిధిని నృత్యగీతాదుల ప్రవర్తింప జేయుటచేత వారిలో నీతిభంగదోష మేర్పడినది. నీపోటీవ్యాసమునందిదియు నీవంగీకరించితివి. దీనికాసంఘీయు లిప్పుడు పొందుచున్న విచార మింతయంతగాదు. నృత్యగీతాదులు మానివైచి వివాహములు చేసికొని తొల్లిటి నైచ్యమును తొలగించుకొని సాటిస్త్రీలోకములో సమానత్వమును బడయుటకై వారిప్పుడు మహాకృషి చేయుచున్నారు. తొల్లి నాట్యాభినయములలో పాల్గొనిన వారిస్థితి కన్నులార గాంచుచు మరల కులస్త్రీల నీయగాధకూపమున బడద్రోయ నెంచుటయు, దానికి నీవంటి విదుషీమణులు చేయూతనిచ్చుటయు శ్రేయస్కరముగాదు.
శ్రీరవీంద్రనాధటాగోరుగారును, హరీంద్రనాధచటోపాధ్యాయులును తమ స్త్రీలను రంగభూమికి తెచ్చిరని వ్రాసితివి. అందుల కాప్రాంతీయులెంతకుందుచున్నదియు ఈమధ్య చెన్నపురిలో జరిగిన సనాతనధర్మసభ కేతెంచిన యొక బెంగాలీబాబు స్త్రీలను రంగభూమికితెచ్చి పాడుచేయుచున్నారని చెప్పి విచారించెను. కంటివా? కాన ఈయుద్యమమున కారాష్ట్రీయు