Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

శారదలేఖలు

కుమారుని చరిత, కర్ణునివంటి దానశూరుని గాథ, గాంధారివంటి మహాసాధ్వి చరిత్రము, భీష్మునివంటి సత్యవ్రతుని వృత్తాంతము, ద్రౌపదివంటి స్త్రీరత్నముయొక్క ధర్మపరిజ్ఞానము, బుద్ధికౌశలము, గృహనిర్వాహకత్వచాతుర్యము దెల్పెడి వృత్తములు మన కాదర్శపాత్రములు కాకేలపోవును? మఱియు మన కాదర్శపాత్రములగు సావిత్రివంటి మహాసాధ్వీమణుల చరిత్రము లెన్నియో యందుపకథలుగా చేరియున్నవి. సోదరీ! భారతభాగవత రామాయణాది పురాణేతిహాసములు నింద్యములని నిషేధించినచో మీ నాటకకళాపోషణకైన కథలేవి? బహు సాంఘికములు, చారిత్రకములునని మీ యుద్దేశమేమో! ఆ విధముగా చూచినను రామదాసు నాటకమాడినచో నాతని యుపాస్యదైవము రాముడు. మీరాబాయియాడినచో నామె దేవుఁడు కృష్ణుడు. మరల అక్కడగూడ పురాణపురుషులే ప్రత్యక్షము. ఎంత నింద్యములని దూషించినను ఆ పురాణేతిహాసములు విడనాడినచో మనకాడుటకు, పాడుటకు, చెప్పుకొనుటకు వేఱు తెన్నే లేదు. తొలుత యెంత తీవ్రముగ నిరసించినను పురాణగ్రంథముల సహాయమును, జ్ఞానముచే తగినంతమాత్రము అవశ్యముగ తీసుకొనుటకు అభ్యంతరము లేదని, నీవును ఒప్పుకొనక తప్పినదికాదు. ఇఁక నిదియే తగునని చెప్పిన నాపై నిశితవిమర్శన లెందుకు?

శివాజీవంటి మహాశూరుని తయారుజేయుటకు జిజీబాయి పురాణగ్రంథములనే ఆశ్రయించినమాట వాస్తవము.