శారదలేఖలు
145
అనగా శ్రేష్ఠుడు దేనినాచరించునో దానినే ప్రమాణముగా గొని లోకము వారి ననుకరించునని దాని తాత్పర్యము. కాన శ్రేష్ఠుఁడైనవాడు, లోకమున కాదర్శపురుషుఁడైనవాడు లోపరహితుడుగా నుండవలెను. కాన స్వార్థమును చంపుకొని లోకహితము గమనింపవలెనని రాముని ఆదర్శము. ప్రజల కోర్కెలదీర్చుట, ప్రజల యభిప్రాయము ప్రకారము నడుచుకొనుట, ప్రజలను కన్నబిడ్డలవలె బ్రోచుట యివి తన పరిపాలనాధర్మములుగా బెట్టుకొనినాఁడు రాముఁడు. ఆ ధర్మమును నిలుపుకొనుటకే ప్రజల యిచ్చాను సారముగా సీతను పరిత్యజించెను. ఈవిషయమున నాతడు పరతంత్రుఁడు, ప్రజాభీష్టానువర్తి. కాన నీసందర్భమున మనము గుర్తింపవలసినది సూక్ష్మతరమైన యాతని ధర్మలక్ష్యముగాని బాహ్యక్రియ గాదు. అంతమాత్రముచే రాముఁడు క్రౌర్యవృత్తిగలవాడనుట పాడిగాదు. రామునకు సీతయం దపారమైన ప్రేమ గలదు. గౌరవముగలదు. విశ్వాసముగలదు. ఇందులకు నిదర్శన మాత డేకపత్నీవ్రతుఁడై యుండి యశ్వమేధాదియాగ సమయంబులలోగూడ స్వర్ణసీతతో యజ్ఞతంతును నడుపుకొనుటవలననే. తెల్లమగుచున్నది. రాముఁడు గావించిన యిట్టి కృత్యమునకు సీత కాతనిపై యభియోగము నడుపగల హక్కుగలదనియంటివి. నిజమే కావచ్చును. ఇక్కాలపు సీత యనగా మీ నాటకపు సీతయైనచో నట్టిపనిని తప్పక చేసెడిదే! కాని కృతయుగపు సీత యట్టిదికాదు. పెనిమిటి ధర్మ