శారదలేఖలు
143
వుని స్వేచ్ఛ నరికట్టకమానవు. ప్రతిమనుష్యుడును నేదేని మతమునకు జెందియుండుట విధినిషేధములులేని తన వృత్తిని యొక కట్టుబాటునకు బద్ధపఱచుకొనుటకే. “యోగ్యమూ, సాధ్యమూ, ఆవశ్యకమూ, హితకరమూ అయినటువంటి నూతనరీతిని నడచుట కేమతముగాని మార్గమునివ్వదు.” తాత్కాలికానందమునుగూర్చెడి ప్రతివిషయమును మనుష్యులకు హితకరముగనే యుండవచ్చును. కాని జీవితముయొక్క యంగాంగమందునూ హితకరమునకు ద్రోవయొసంగుట కే మతముగాని యంగీకరింపదు.
జ్ఞానము జగన్మాన్యమగుట వాస్తవమే. అయినను నదియు నీతిసత్యములకు నిబద్ధమైనప్పుడే జగన్మాన్యతబడయును. మనుజుని జీవితవికాసమునకు దోడ్పడి యుచ్ఛస్థితికి గొనిపోవునది మాత్రమే నిష్కళంకజ్ఞానము. కాని మనుష్యుని విపరీత స్వేచ్ఛజ్ఞానముయొక్క నిదర్శనము కాజాలదు.
జ్ఞానులు తత్వజ్ఞులునైనవారు శ్రీరాముని జీవితమును దోషకలితమనుట కిదియే మొదలు. మన హైందవపురాణేతిహాసములలో నుత్తమము, నాదర్శమునునుగు నితిహాసమేదైనగలదనినచో నది శ్రీరాముని చరిత్రమే యని చెప్పక తప్పదు.
'రాముఁడు దుష్టుడు. ఆయన జీవితములో మోసము, కౌర్యము కానబడునేకాని విశేషసద్గుణము కనుపించుటలే'దని, నీవు వ్రాసితివి. రాముడు ధర్మజీవి. సత్యము, ధర్మము, నీతి